200 units | రేవంతన్న ప్రభుత్వం దేశానికే ఆదర్శం….

200 units | రేవంతన్న ప్రభుత్వం దేశానికే ఆదర్శం….
- డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస నేత.
200 units | చండూర్, ఆంధ్రప్రభ : చండూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోజున విలేకరులకు సమావేశం నిర్వహించిన నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన అన్నారు. తెలంగాణలో రెండు సంవత్సరాలుగా అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు,500 గ్యాస్ సిలిండర్, ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణ రేవంత్ సర్కార్ ఆదర్శంగా నిలిచిందన్నారు.
అక్రమణ సంపాదనతో బిజెపి, బీఆర్ఎస్ దొంగ హామీలతో మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని అన్నారు. వారు గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని తెలియజేశారు. స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారాద్యంలో 100 కోట్లతో చండూర్ మున్సిపాలిటీ అభివృద్ధి జరగబోతుందని తెలియజేశారు. అందుకే వారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి జరగాలంటే చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్నీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోటీ చేసిన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
