ఊట్కూర్‌లో 25న హిందూ సమ్మేళనం….

ఊట్కూర్‌లో 25న హిందూ సమ్మేళనం….
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో మార్చి 25న హిందూసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు సిరిగిరి చందూలాల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంఘేశక్తికలౌయుగే భారతదేశముకు ఆత్మ, ప్రాణం హిందూధర్మం అలాంటి హిందూ ధర్మంను చైతన్య పరచుటకు, విశ్వ గురువుగా నిర్మాణం చేయాలని లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని తెలిపారు.
లక్ష్యసాధనలో భాగంగా హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఊట్కూర్ ఖండ లో ఊట్కూర్ ఉప మండల హిందూ సమ్మేళనంఇందులో 10 గ్రామాల నుండి హిందూ బంధువులు కుటుంబాలతో గ్రామాల నుండి కోలాటం, భజన, వేషాధారణ, నినాదాలతో పెద్ద ఎత్తున ఈ హిందూ సమ్మేళనంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా సిరిగిరి చందులాల్, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ గౌడ్, కోశాధికారిగా భాస్కర్ తో పాటు 20 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా శ్రీ స్వామి అనంతానంద భారతి పురాణపీఠం, అనంతసాహితీ ఆశ్రమం హైదరాబాద్ ముఖ్య వక్తగాభాగయ్య, అఖిల భారతీయ కార్యకారిణి సదస్సులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
