2 Mn Bbl Oil Tanker Fired : కువైట్​ ట్యాంకర్​ ధ్వంసం

2 Mn Bbl Oil Tanker Fired : కువైట్​ ట్యాంకర్​ ధ్వంసం

  • జెబెల్ అలీ పోర్ట్ లో డ్రోన్​ దాడి
  • లంగరేసిన అల్-సల్మీ మటాష్​
  • అమెరికా మాటలు.. .
  • ఇరాన్​ దాడులు
  • నడుమ గల్ఫ్​ గగ్గోలు
  • లక్షల బారెళ్ల ఆయిల్​ సముద్రం పాలు
  • ప్రపంచ దేశాలు లబోదిబో

( ఆంధ్రప్రభ, దుబాయ్​ ప్రతినిధి)

2 Mn Bbl Oil Tanker Fired

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ నోటి దురుసు తనం మిత్ర దేశాల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గంటకో వ్యాఖ్యతో ఇరాన్​ దేశాన్ని అమెరికా అధ్యక్షుడు రెచ్చగొడుతుంటే.. అందుకు సమాధానంగా తన ఇరుగు పొరుగున అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్​ విరుచుకు పడుతోందిన.

2 Mn Bbl Oil Tanker Fired

తాజాగా ..హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే, ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు బావులు , ఖార్గ్ ద్వీపం (Kharg Island) సహా కీలక ఇంధన కేంద్రాలను “పూర్తిగా నాశనం” (Obliterate) చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. డీల్ కుదుర్చుకోవడానికి ఏప్రిల్ 6వ తేదీ చివరి గడువుగా ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ అంగీకరించకపోతే, ఇంతకు ముందు కని విని ఎరుగని రీతిలో.. తాకని (not yet ‘touched’) ఇరాన్ డీశాలినేషన్ ప్లాంట్లను (నీటి శుద్ధి కేంద్రాలు) కూడా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

2 Mn Bbl Oil Tanker Fired : అల్-సల్మీ మటాష్​

2 Mn Bbl Oil Tanker Fired

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే, ఇరాన్ దళాలు ప్రతీకారంగా దుబాయ్ తీరంలో భారీ చమురు ట్యాంకర్‌పై దాడి చేశాయి: దుబాయ్ కి చెందిన జెబెల్ అలీ పోర్ట్ (Jebel Ali Port) నకు వాయువ్యంగా (Northwest) సుమారు 31 నాటికల్ మైళ్ల దూరంలో నౌకలు నిలకడగా ఉండే యాంకరేజ్ పాయింట్ వద్ద ఈ దాడి జరిగింది.ఈ దాడిలో కువైట్‌కు చెందిన ‘అల్-సల్మీ’ (Al-Salmi) అనే భారీ ముడి చమురు ట్యాంకర్ పై ఇరాన్​ డ్రోన్లతో దాడి చేసినట్టు ప్రాథమిక సమాచారం. భారత కాలమానం ప్రకారం, మార్చి 31, 2026, మంగళవారం తెల్లవారుజామున 01:40 గంటల సమయంలో ఈ దాడి జరిగిది.

2 Mn Bbl Oil Tanker Fired : చమురు సముద్ర పాలు

2 Mn Bbl Oil Tanker Fired

ఈ ట్యాంకర్ సుమారు 2 మిలియన్ బారెళ్ల చమురు​ తో పూర్తిగా నిండిన స్థితలో అకస్మాత్తుగా దాడి జరిగింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ట్యాంకర్ వెనుక భాగం (Hull) దెబ్బతింది సముద్రంలో చమురు ఒలికిపోయే ప్రమాదం ఉందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) హెచ్చరించింది. ఈ ట్యాంకర్‌లోని 24 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని దుబాయ్ అధికారులు ధృవీకరించారు. మంటలను కూడా అదుపులోకి తీసుకువచ్చారు.

ALSO READ : 5 Gulf Countries : గ‌ల్ఫ్ కంట్రీస్ గ‌జ‌గ‌జ‌ Andhra Prabha War Story

Leave a Reply