ఘనంగా శ్రీ సల్లాపురమ్మ బోనాలు..

ఘనంగా శ్రీ సల్లాపురమ్మ బోనాలు..
రాప్తాడు, ఆంధ్రప్రభ : అమ్మా అని ఒక్కసారి మొరపెట్టుకుంటే చాలు ఆపదలన్నీ తీర్చే అమ్ములగన్న అమ్మ శ్రీ సల్లాపురమ్మ బోనాలు జాతర భక్తిశ్రద్ధలతో ఘనంగా వైభవంగా నిర్వహించామని గ్రామ సర్పంచ్ ఉమాదేవి పక్కీరప్ప ఎంపీటీసీ రుక్మిణమ్మ మరియు పెద్దలు తెలియజేశారు. రాప్తాడు మండల పరిధిలోని ఎం.బండిమీదపల్లి గ్రామం నందు 2 రోజులు పాటు శ్రీ సల్లాపురమ్మ జాతర బోనాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు చుట్టుపక్కల గ్రామాల భక్తాదులు అధిక సంఖ్యలో బోనాలు తీసుకువచ్చి అమ్మకు నైవేద్యంగా పెట్టారు.
ఎన్నో కుటుంబాలకు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి సల్లాపురమ్మ అని భక్తుల నమ్మకం.అందుకే ఆమె భక్తుల హృదయాల్లో అచంచలమైన విశ్వాసంగా నిలిచింది.అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి మూలపుటమ్మ అంటూ భక్తులు పిలిచే ఈ దేవతకు గ్రామంలో ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా దర్శనం తీసుకోవడం ఆనవాయితీ ఆలయ ప్రాంగణంలో హోమాలు ప్రత్యేక పూజలు భక్తి గీతాలతో మార్మోగింది.జాతరతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

పల్లకీ సేవలు అర్చనలు దీపారాధనలు ప్రతి కార్యక్రమం భక్తులను భక్తి పరవశంలో ముంచెత్తింది.మధ్యాహ్నం నుండి పార్వేట ఉత్సవం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత భోజనము మంచినీరు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరల వచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దగ్గుపాటి శ్రీనివాసులు గ్రామ సర్పంచ్ ఉమాదేవి పక్కీరప్ప ఎంపీటీసీ రుక్మిణమ్మ వై. నరసింహారెడ్డి బి. వెంకటరాముడు సాయినాథ్ రెడ్డి నరసింహారెడ్డి తలారి చెండ్రాయుడు కదిరప్ప నాగరాజు సల్లప్ప రాము ఈశ్వరయ్య చంద్రప్ప గ్రామ ప్రజలు భక్తాదులు పాల్గొన్నారు.
