2-Ai-Dogs : వావ్.. ఇ స్మార్ట్ డాగ్స్ ఎంట్రీ! Andhra Prabha SPL News

2-Ai-Dogs : వావ్.. ఇ స్మార్ట్ డాగ్స్ ఎంట్రీ! Andhra Prabha SPL News
- కారకాస్‌లో హైటెక్ కుక్కలు..
- నేరగాళ్లకు చెక్ !
- దొంగలకు నో ఛాన్స్!
- AI డాగ్స్ గస్తీ.. గురూ
- వెనిజులాలో సూపర్ పోలీసింగ్!
- రాత్రంతా గస్తీకే ఈ స్మార్ట్ కుక్కలు..
- ఇదే భవిష్యత్ పోలీసింగ్!
( ఆంధ్రప్రభ, కారకస్ ప్రతినిధి)

2-Ai-Dogs : నిన్నా మొన్నటి వరకూ .. వీధుల్లో ఆందోళనలు.. సర్కారీ వేధింపులతో తల్లడిల్లుతుంటే.. మరో అమెరికా పెద్దన్న సైనిక దాడి చేసి.. అక్కడి సహజ సంపదలకు ఎసరు పెడితే.. అల్లాడిన వెనిజులాలో.,… ఇప్పుడిప్పుడే జనంలో ఆహ్లాదకర సన్నివేశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ చిత్ర విచిత్ర సన్నివేశాల్లో జనం సంబహ్మాచర్యంలో మునిగి తేలుతున్నారు. ఈ విషయాలు గమనిద్దాం.
2-Ai-Dogs : లాటిన్ అమెరికాలోనే స్పెషల్
అది వెనిజులా రాజధాని కారకాస్. ఇందులోని చాకావో (Chacao) మునిసిపాలిటీలో జనం మాన ప్రాణాలను కాపాడే రక్షక భటులు స్మార్ట్ పోలీసు అవతారం ఎత్తారు.

వీధుల్లో రాత్రి లేదు. అపరాత్రి లేదు. పగలు లేదు. దొంగలు, నేరగాళ్లను పసిగట్టేందుకు.. నిఘా గస్తీ కోసం టర్బో (Turbo) వోల్టియో (Voltio) అనే రెండు అత్యాధునిక రోబోటిక్ కుక్కలను ప్రవేశపెట్టారు. ఈ వినూత్న భద్రతా చర్య వివరాలు ఇలా ఉన్నాయి. కారకాస్ నగరంలోనే సుసంపన్న జిల్లా కేంద్రం చాకావో మునిసిపాలిటీ మేయర్ గుస్తావో డ్యూక్ (Gustavo Duque) ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ రెండు రోబోటిక్ కుక్కలను 2026లో మార్చి ప్రవేశపెట్టారు.
2-Ai-Dogs : మామూలు డాగీలు కాదు గురూ
ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో పనిచేస్తాయి. వీటిలో అత్యంత ఖచ్చిత సెన్సార్లు, థర్మల్ కెమెరాలు, ఆడియో సెన్సార్లు ఉంటాయి. ఇవి బహిరంగ ప్రదేశాలు, ముఖ్యంగా రాత్రిపూట గస్తీ నిర్వహిస్తాయి.

ఇవి అనుమానాస్పద కార్యకలాపాలను ఇట్టే పసిగట్టేస్తాయి, వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ క్లియర్ గా స్కాన్ చేస్తాయి. లైవ్ వీడియోను కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తాయి. ఈ రోబోటిక్ కుక్కలు మెట్లు ఎక్కగలవు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో నడవగలవు .

అత్యవసర సమయాల్లో వాయిస్ కమాండ్లకు కూడా స్పందిస్తాయి. సాధారణ పోలీస్ కుక్కల స్థానాన్ని భర్తీ చేయడం వీటి ఉద్దేశ్యం కాదు. కేవలం భద్రతా సిబ్బందికి అదనపు సాయం అందించడం పర్యవేక్షణను మెరుగుపరచడం వీటి ప్రధాన లక్ష్యం. లాటిన్ అమెరికాలోనే ఇలాంటి ‘స్మార్ట్ పోలీసింగ్’ వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి మునిసిపాలిటీగా చాకావో నిలిచింది. భళా చాకావో..
ALSO READ : 4000 Luxury Cars Stuck : కెన్యాలో కార్ల జాతర ..Andhra Prabha SPL News
