అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి

1వ వార్డు అభ్యర్థి కట్ట సురేష్ కుమార్ గుప్తాకు మద్దతుగా ఆర్యవైశ్య మహిళల ప్రచారం
ఆంధ్రప్రభ, మక్తల్ : మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని 1వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కట్ట సురేష్ కుమార్ గుప్తా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వార్డు పరిధిలోని వినాయక నగర్ లో కట్టా సురేష్ కుమార్ గుప్తాకు మద్దతుగా బికెఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి,పెద్ద ఎత్తున ఆర్యవైశ్య మహిళలు పాల్గొని ఇంటింటా ప్రచారం చేపట్టారు.కాంగ్రెస్ అభ్యర్థి కట్ట సురేష్ కుమార్ గుప్త హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
ప్రతి ఏరియాలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థి కటా సురేష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ మక్తల్ అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు. ఈ ప్రాంతంలో నెలకొన్న అంతర్గత రోడ్లు డ్రైనేజీ తాగునీటి సమస్య పరిష్కారానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని వీలైనంత త్వరలో సమస్యలన్నింటినీ పరిష్కరించి ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఇప్పటికే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో పెద్ద ఎత్తున సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను కూడా వినాయక్ నగర్ ప్రాంతానికి అన్ని ప్రాంతాల కన్న ఎక్కువగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు .ఎన్నికల్లో ఆదరించి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం అన్న నినాదం మర్చిపోవద్దని అభ్యర్థి కటా సురేష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల రంజిత్ రెడ్డి, నర్సింగ్ రావు ,శ్రీనివాసరావు,జమీర్, బోయ రామకృష్ణ, నరేందర్, అశోక్ ,మాలకటి నాగిరెడ్డి, చాకలి ఆంజనేయులు, జగదీష్. తదితరులు పాల్గొన్నారు.
