సేవకుడిగా మీకు సేవ చేస్తాను

ఒకటో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కర్నె లక్మీ నర్సయ్య ( యోగేశ్వర్ నర్సయ్య )
భీమ్గల్ టౌన్, ఫిబ్రవరి 5 ( ఆంధ్రప్రభ ) వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవకుడిలా సేవ చేస్తానని ఒకటో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కర్నె లక్మీ నర్సయ్య ( యోగేశ్వర్ నర్సయ్య ) అన్నారు. గురువారం ఒకటో వార్డు లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకటో వార్డు పరిధిలోని అయ్యప్ప నగర్ లో ప్రతి వర్షాకాలం లో మొగిలి చెరువు ద్వారా ఇండ్ల మధ్యలోకి నీరు రావడం జరుగుతుందని, సమస్య రాకుండా చేస్తానని పేర్కొన్నారు. కాలనీ లో సరైన రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు లేకుండా చేసేందుకు రోడ్లు నిర్మాణం చేపిస్తానని హామీ ఇచ్చారు. వార్డు ను శుభ్రంగా ఉంచేందుకు చెత్త సేకరణ వాహనాల ఏర్పాటు, డ్రైనేజి పూడిక తీత పనులు, దోమల నివారణకు చర్యలు తీసుకుంటానని అన్నారు. వార్డు ప్రజల ఆరోగ్యం కొరకు మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య శిభిరం ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనునిత్యం అందుబాటులో ఉండి, సమస్యలపై మున్సిపల్ లో లేవనేత్తి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. బీజేపీ మద్దతుగా పోటీలో ఉన్న తన గుర్తు కమలం ( పువ్వు ) ఓటు వేసి విజయం అందించాలని వేడుకున్నారు.
