ప్రచార పర్వంలో… ముందంజలో పల్లెర్ల వెంకన్న

ప్రచార పర్వంలో… ముందంజలో పల్లెర్ల వెంకన్న
- 1వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా
- ఎమ్మెల్యే సామెల్ సహకారంతో వార్డు అభివృద్ధి పరుస్తా
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ లో 1వ వార్డులో సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న ప్రచార పర్వంలో ముందంజలో కొనసాగుతున్నారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన తాను… నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని… ఈ ఒక్కసారి తనకు అవకాశం కల్పించి 1వ వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే… వార్డులో సమస్యల పరిష్కారంతోపాటు, అభివృద్ధి పనులు చేపట్టి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో ఈ వార్డు ను ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. ప్రధానంగా మహిళల పేరిట సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పారదర్శకంగా పాలన చేస్తున్నారని, వార్డు ప్రజలు ఫిబ్రవరి 11 జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కళ్లెం నర్సయ్య, మహమ్మద్ అలీ , పోచం కన్నయ్య, పి స్వామి రాయుడు, కప్పే యాకేష్ , బోయిని యాకయ్య, గనగాని అనిల్, వడకాల బాలకిషన్, ఇక్కిరి నాగరాజు, సోమిరెడ్డి, చింటూ తదితరులు పాల్గొన్నారు.
