వందలాది ఓటర్లతో …వెంకన్న ప్రచారం

వందలాది ఓటర్లతో …వెంకన్న ప్రచారం

  • ప్రచారంలో దూసుకుపోతున్న 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి….

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలోని 1వ వార్డులో ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న దూసుకుపోతున్నారు. గురువారం వార్డు పరిధిలో వందలాదిమంది ఓటర్లు, పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు చేయి గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్ల తో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో 1వ వార్డులో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు, నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం తాను అహర్నిశలు కృషి చేస్తానని, ఈ ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపించాలని కౌన్సిలర్ అభ్యర్థి వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply