1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కవితకు ప్రచారం..

1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కవితకు ప్రచారం..
నర్సంపేట, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ను ఏకపక్షంగా గెలిపించాలి అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మాదన్నపేట,నర్సంపేట మున్సిపాలిటీ, వరంగల్ జిల్లానర్సంపేట మున్సిపాలిటీ 1వ వార్డు (మాదన్నపేట) బీఆర్ఎస్ అభ్యర్థి కడారి కవిత కుమారస్వామి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన సుదర్శన్ రెడ్డి, మున్సిపాలిటీ ఎన్నికల్లో విలీన గ్రామాల ప్రజలు బీఆర్ఎస్ను ఏకపక్షంగా గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి, కారు గుర్తుతో పోటీ చేసే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, మున్సిపాలిటీలో గులాబీ జెండాను ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఎన్నికల ఇన్చార్జ్ కక్కర్ల శ్రీనివాస్ గౌడ్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి,మాజీ సర్పంచలు, మండల 1వ వార్డు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
