195th birth | మహిళా విద్యకు బాటలు…

195th birth | మహిళా విద్యకు బాటలు…
- స్త్రీ అంటే ఓ నీడ కాదు ఓ సృష్టికర్త
195th birth | వేల్పూర్, ఆంధ్రప్రభ : మహిళా విద్యకు బాటలు వేసిన గొప్ప సంస్కర్త సావిత్రిబాయి పూలే అని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు సూచించారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 195వ జయంతి(195th anniversary) పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు, రవికుమార్ మాట్లాడుతూ స్త్రీ అంటే ఓ నీడ కాదు ఓ సృష్టికర్త” అనే భావనను తన రచనలు, జీవితం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన తొలి రచయిత్రి సావిత్రిబాయి పూలే అని చెప్పారు.మహిళా విద్య, సామాజిక సమానత్వం, మానవత్వం కోసం ఆమె సాగించిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని కొనియాడారు.
సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా, భారతదేశ సామాజిక చరిత్రలో చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యం అన్నారు. భర్త జ్యోతిరావు పూలేతో కలిసి దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించి, మహిళా విద్యకు(women’s education) బాటలు వేసిన గొప్ప సంస్కర్త సావిత్రిబాయి అని కొనియాడారు.
మహిళ చేతిలో పుస్తకాన్ని పెట్టి, విద్యనే ఆయుధంగా అందించిఆ కాలంలో మహిళా విద్యపై ఉన్న అపోహలను, అణచివేతలను ఎదుర్కొంటూ ఆమె చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ ఉప సర్పంచ్ బాలయ్య అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్, డా.క్రాంతి కుమార్ బి ఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
