ప్రచారంలో దూకుడు..ప్రజల్లో నమ్మకం

ప్రచారంలో దూకుడు..ప్రజల్లో నమ్మకం
-మహమ్మద్ జబ్బార్ వైపే 18వ వార్డు చూపు
స్టేషన్ ఘన్ పూర్ ఫిబ్రవరి7 ఆంధ్రప్రభ: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి మహమ్మద్ జబ్బార్ ప్రచారం రోజురోజుకు ఊపందుకుంటోంది. యువ నాయకుడిగా ప్రజల్లో నమ్మకం సంపాదించుకుంటూ ఇంటింటి ప్రచారంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రజల సమస్యలను దగ్గర గా విని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉంటానని భరోసా ఇస్తుండటంతో అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది.ముఖ్యంగా యువత నుంచి వస్తున్న మద్దతు ప్రచారానికి కొత్త ఉత్సాహం తీసుకొస్తోంది. వార్డులో మార్పు కావాలన్న ఆకాంక్షతో ప్రజలు జబ్బార్ వైపు మొగ్గు చూపు తున్నారు. ఇందులో భాగంగా శనివారం వార్డులో స్థానిక నాయకులతో కలిసి జబ్బార్ ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా అడుగు గడుగునా జబ్బార్ గెలుపు ఖాయమని18వ వార్డులో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని ప్రజానీకం ధీమా వ్యక్తం చేస్తోంది.ఈ కార్యక్రమం లో మునిగెల రాజు, మునిగెల మహేష్, వీర సింగ్ మహమ్మద్ జహీర్ ఖురేషి, మహమ్మద్ అజీజ్ ఖురేషి, నక్క ప్రవీణ్ సయ్యద్ అయాజ్ బైక్ తోట హరీష్,హస్తము ప్రభు కిరణ్, స్వస్థంశల మంద తోట రమేష్, మహమ్మద్ యూనుస్, ప్రస్తుతం రాజు, ప్రస్తుతం జీవన్ నీరెడ్డి సంతోష్ తదితరులు పాల్గొన్నారు
