17th Ward | మీ ఇంటి వ్యక్తిగా ఆదరించండి…

17th Ward | మీ ఇంటి వ్యక్తిగా ఆదరించండి…
17th Ward | జనగామ, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీలో 17 వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఉడుగుల కిష్టయ్య భార్గవ్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 17 వార్డు నుండి మీ ఇంటి వ్యక్తిగా ఆదరించి గెలిపించాలని, వార్డు ప్రజల అభిప్రాయం మేరకు కౌన్సిలర్ గా బరిలో ఉన్నానని, గతంలో స్వల్ప ఓట్లతో ఓటమి జరిగిందని, ఈసారి ఒక్కసారి తనకు అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపించాలని ఓటర్లకు విన్నవిస్తున్నారు.
ఈ ఒక్కసారి తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే.. వార్డును ఎమ్మెల్యే పల్లా సహాయ సహకారంతో 17 వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని హామీ ఇస్తున్నానని వెల్లడించారు…
