16 Days | నిందితులను ఎప్పుడు అరెస్టు చేస్తారు??

16 Days | నిందితులను ఎప్పుడు అరెస్టు చేస్తారు??
16 రోజులైనా నిందితులు దొరకరా???
మూడు పోలీసు బృందాలతో గాలింపు.
నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం
ఆందోళన బాట లో బాధితులు
పాలకులు ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం మా ??
ఈ ఘటనకు ముగింపు ఎప్పటికీ ???
16 Days | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలోని కొమ్మెర ఘటన రెండు నెలల పసికందు చావుకు కారణమైన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం విధితమే. ఈ ఘటన జరిగి దాదాపుగా 16 రోజులు అవుతున్న ఈ ఘటనలో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను ఇప్పటివరకు అరెస్టు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది .పాలకులు ప్రభుత్వ యంత్రాంగం నిందితుల వైపా? లేదా బాధితుల వైపు అని చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతుంది .ఈ ఘటనలో ముగ్గురిని రిమాండ్ కు తరలించి ఆరుగురిని పట్టుకోవడానికి మూడు పోలీస్ బృందాలతో గాలిస్తున్నట్లు ఆనాటి నుండి ఈనాటి వరకు పోలీసులు చెప్పుతూ వస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అరెస్టులు కాకపోవడమే ప్రధాన కారణమని చర్చ నడుస్తోంది .

నిందితులుగా ఉన్న ఆరుగురు అంటిస్పేటరీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకోసమే పోలీసులకు సరెండర్ కావడం లేదని వాదన వినిపిస్తున్నది పోలీసులు నిందితుల వైప బాధితుల వైప అనే చర్చ కూడా కొనసాగుతున్నది పోలీసులకు పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ అరెస్టులు పెద్ద పనేం కాదని వాదన కూడా వినిపిస్తుంది. ఈ దిశలోనే అరెస్టులు కాకపోవడంతో తిరిగి బాధితులు ఆందోళన బాట నాగర్కర్నూల్ లో చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈనెల 18న కుమ్మెర జాతరలో గొడవ జరిగి ఇరుపక్షాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు .

దీనిపై కౌంటర్ కేసు ఆలస్యంగా చేశారని అట్రాసిటీ కేసు, హత్య కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తూ బాధితులు ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన ప్రారంభమైన విషయం విధితమే. ఫిబ్రవరి 21న పాప చనిపోవడం ,22న పాప తల్లి మౌనిక తాను ఎస్సీ అని దాడిలోనే చిన్నారి చనిపోయిందని ఫిర్యాదు చేయడంతోఆ సెక్షన్లతో నాగర్ కర్నూల్ డిఎస్పి కేసు నమోదు చేసి విచారణ జరిపించారు. ఇప్పటికే విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణలో మౌనిక ఎస్సీ కాదని బిసి ఏ అని కులం సర్టిఫికెట్ రావడం జరిగింది. ముగ్గురు అరెస్టు చేసి ఇంకా ఆరుగురి పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు .ఇది ఇలా ఉండగా ఇది బీసీలు ఎస్సీలు లకు అన్యాయం జరిగిందని, అగ్రకులాలకు అండగా ఉండి అరెస్టు చేయడం లేదని ఆరోపిస్తూ బాధితులు అంబేద్కర్ చౌరస్తా వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు .

ఈ ధర్నాకు వివిధ పార్టీలకు చెందిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ ధర్నా కొనసాగుతున్న సందర్భంలో సిపిఎం సిపిఐ బి ఎస్ పి, బిజెపి, టీఆర్ఎస్ అధ్యక్షులు కార్యదర్శులు జాన్ వెస్లీ కేటీఆర్ రామచంద్రరావు ఇబ్రహీం శేఖర్ తదితర నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపి అరెస్టులు అయ్యేంతవరకు ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందే విధంగా ఆందోళనలు జరిగాయి. ఇది ఇలా ఉండగా నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి వంశీకృష్ణ వీరబల్లి శంకర్ ఇతర నాయకులు కుమ్మెర గ్రామాన్ని సందర్శించి బాధితులకు న్యాయం చేస్తామని నిందితులను చట్టపరంగా శిక్ష పడుతుందని చెప్పడం జరిగింది. గత నెల 26న బాధితులు ఇక్కడ న్యాయం జరగడం లేదని హైదరాబాద్కు వెళ్లి ఆందోళన బాట విశారదన్ నాయకత్వంలో చేపట్టారు .ఆ క్రమంలోని డిజిపిని కలిశారు వివిధ కమిషన్లను ఆశ్రయించి బాధితుల పక్షాన తమ గోడును విన్నవించి న్యాయం చేయాలని కోరారు. గురువారం సిపిఎం ప్రజా సంఘాలు ట్యాంక్బండ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడితే అరెస్టులో జరిగాయి .

విశారదన్ నాయకత్వంలో మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు న్యాయం చేయాలని కోరారు ఈ నేపథ్యంలోనే న్యాయం హైదరాబాదులో కూడా జరగనందున శుక్రవారం హైదరాబాద్ గాంధీ పార్క్ ఇందిరా పార్క్ లో ధర్నా చేసి అనంతరం తిరిగి నాగర్ కర్నూల్ లో ఆందోళన కార్యక్రమం చేపడతామని బాధితుల పక్షాన హైదరాబాదులో విశారదన్ ఒక ఛానల్ కు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం జరిగే వరకూ తాము పోరాటం చేస్తామని బాధితులు చెప్తున్నారు. ఈ అరెస్టులు హత్య నేరం కేసు ఎప్పుడు నమోదు అవుతాయి ఎప్పుడు జరుగుతాయి ఈ కేస్ కు అంతిమ పరిష్కారం ఏమిటనే చర్చ నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది .పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అధికార పక్షం ఏమి చేస్తుందోనని ఎదురు చూడాల్సి ఉంది.

