బిజెపి 15 వార్డ్ అభ్యర్థి డప్పు చప్పులతో జోరుగా ప్రచారం

బిజెపి 15 వార్డ్ అభ్యర్థి డప్పు చప్పులతో జోరుగా ప్రచారం

వార్డులోని ఓటర్ల ఇంటింటికి తిరుగుతూ ఓట్ల అభ్యర్థన

పరకాల, ఫిబ్రవరి 9 (ఆంధ్రప్రభ): పట్టణంలోని 15వ వార్డులో బిజెపి అభ్యర్థి డప్పు చప్పులతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం రోజు బిజెపి 15వ వార్డు అభ్యర్థి కుక్కల విజయకుమార్ ఆధ్వర్యంలో 15వ వార్డు పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా, కూరగాయల మార్కెట్, స్వర్ణకార సంఘం వీధిలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి విజయ్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ బిజెపి పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్, బిజెపి నాయకులు చందుపట్ల రాజేందర్ రెడ్డి, దగ్గు విజేందర్ రావు, కానుగుల గోపి, కుక్కల శ్రీధర్, కుక్కల శంకర్, బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply