ఎన్నికలవేళ లక్ష యాభైవేలు

ఎన్నికలవేళ లక్ష యాభైవేలు

పోలీసులు స్వాధీనం

చెన్నూర్ ఫిబ్రవరి : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ 15వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి గుర్రం ఉమారాణి శ్రీనివాస్ లకు చెందిన లక్ష యాభై వేల రూపాయల నగదును టౌన్ సీఐ బన్సీలాల్ తమ సిబ్బంది తో కలిసి పట్టుకున్నారు.ఎన్నికలలలో భాగంగా విధులు చేపడుతున్న పోలీసులకు స్థానిక ప్రతాప్ మారుతి హనుమాన్ టెంపుల్ సమీపంలో పట్టణానికి చెందిన పడమటింటి శ్రీనివాస్ అనే వ్యాపారి నగదు రూపాయలతో తరస పడగా తనిఖీ చేయగా శ్రీనివాస్ వద్ద లక్ష యాభై వేల రూపాయలు లభిచడంతో విచారణ చేపట్టిన పోలీసులకు తన మిత్రుడు(గుర్రం శ్రీనివాస్) అవసరం కొరకు డబ్బులు తీసుకువెళ్తున్నట్లు తెలడం తో డబ్బులు స్వాధీనం చేసుకొని ఎన్నికల ప్రత్యేక (ఎఫ్ఎస్ టీ) ఫ్లైయింగ్ స్క్వాడ్ కు అందజేశారు. ఎన్నికల దృశ్య ప్రజలు, వ్యాపారులు ఎలాంటి కారణాలు లేకుండా అధిక మొత్తంలో డబ్బుల లావాదేవీలు చేసినట్లయితే ఎన్నికల నిబంధనల ప్రకారం సీజ్ చేయడం జరుగుతుందని సీఐ బన్సీలాల్ ఈ సందర్బంగా తెలిపారు.

Leave a Reply