ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

-14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోప్పి రాజశేఖర్

రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 06(ఆంధ్రప్రభ): నిజాయితీ, సమస్యలు పరిష్కరించాలనే తపన,ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే సంకల్పం వస్తున్న తనను ఆదరించాలని,బిఆర్ఎస్ బలపరిచిన 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోప్పి రాజశేఖర్(సంతు)కోరారు.శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరారు. వార్డులో డ్రైనేజీ,రోడ్ల తోపాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.గతంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి శూన్యమని ఎద్దేవాచేశారు.ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ అభ్యర్థి కోప్పి రాజశేఖర్ కోరారు.

Leave a Reply