మైనర్ బాలికపై వేధింపులు…

మైనర్ బాలికపై వేధింపులు…
- నిందితుడిపై పోక్సో కేసు నమోదు..
- రిమాండ్‌కు తరలింపు..
- చిట్యాల ఎస్ఐ సతీష్ వెల్లడి..
చిట్యాల, ఆంధ్రప్రభ : ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని బెదిరింపులకు పాల్పడిన నిందితుడిని శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలోని, దూతుపల్లి కి చెందిన బాణాల రాకేష్ అనే యువకుడు, ఒక మైనర్ బాలికను కొంతకాలంగా వెంటాడుతూ వేధిస్తున్నాడని, తనను ప్రేమించాలని, లేదంటే ఆమెకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని సదరు బాలికను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశాడని, బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
బాలిక మైనర్ కావడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు . అరెస్ట్ చేసిన నిందితుడిని భూపాలపల్లి సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు జైలుకు తరలించారు. మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా చట్టం దృష్ట్యా కఠిన శిక్షలు ఉంటాయని ఎస్.ఐ. సతీష్ హెచ్చరించారు.
