12thFeb2026 | గురువారం, నేటి పంచాంగం: రాశి ఫలితాలు & దైవారాధన విశేషాలు

12thFeb2026 | గురువారం, నేటి పంచాంగం: రాశి ఫలితాలు & దైవారాధన విశేషాలు

12thFeb2026 | నేటి పంచాంగ వివరాలు

(తిథి, నక్షత్రం, యోగం)
విజయ ఏకాదశి విశేషం
నేటి గ్రహ స్థితి
నేటి దైవారాధన & విశేష పూజ
నేటి రాశి బలాబలాలు
నేటి శ్లోకం
ద్వాదశ రాశి ఫలితాలు

12thFeb2026 | పంచాంగం :

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణ పక్షం.
తిథి: ఏకాదశి (తె. 3:57 వరకు)
వారం: గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం: మూల (తె. 5:41 వరకు)
యోగం: హర్షణ ||

కరణం: బవవర్జ్యం:మ. 2:26 నుండి 3:07 వరకు, మరల మ. 3:07 నుండి 3:48 వరకు.దుర్ముహూర్తం:ఉ. 10:19 – 11:00 వరకు, మరల మ. 2:58 – 3:39 వరకు.రాహుకాలం:మ. 1:19 నుండి 2:36 వరకు.

విశేషం : విజయ ఏకాదశి.అన్ని కార్యాల్లో విజయం కోసం విష్ణు పూజ చేయడం శ్రేష్ఠం.

12thFeb2026 | నేటి గ్రహ స్థితి:

రవి, కుజ: మకర రాశి.
బుధ, శుక్ర, రాహువు:కుంభ రాశి.
కేతువు: సింహ రాశి.
చంద్ర: ధనుస్సు రాశి (మూల నక్షత్రం).
శని: మీన రాశి || గురువు:మిథున రాశి.

12thFeb2026 | నేటి దైవారాధన:

విశేష పూజ: ఏకాదశి మరియు గురువారం కలయిక చాలా పవిత్రమైనది. శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలతో అర్చన చేయాలి.

పఠించవలసినవి: విష్ణు సహస్రనామం, గోవింద నామాలు.

12thFeb2026 | నేటి రాశి బలాబలాలు:

అనుకూలం: మేషం, సింహం, తుల, కుంభం.
ప్రతికూలం: వృషభం (అష్టమ చంద్రుడు), కన్య (అర్ధాష్టమ).

12thFeb2026 | నేటి శ్లోకం:

12thFeb2026
12thFeb2026

విష్ణు స్తుతి
నమామి నారాయణ పాదపంకజం
కరోమి నారాయణ పూజనం సదా |
వదామి నారాయణ నామ నిర్మలం
స్మరామి నారాయణ తత్వమవ్యయమ్ ||”

12thFeb2026 | ద్వాదశ రాశి ఫలితాలు:

మేషం: (భాగ్య చంద్రుడు) అదృష్టం కలిసి వస్తుంది. దైవ దర్శనం, తీర్థయాత్రలకు ప్రణాళికలు.
వృషభం : (అష్టమ చంద్రుడు) ఆరోగ్యం జాగ్రత్త. అనవసరభయాలు. ఎవరితోనూ గొడవలు వద్దు.
మిథునం: (సప్తమ చంద్రుడు) వ్యాపార విస్తరణ. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం: (షష్టమా చంద్రుడు) ఋణ బాధలు, శత్రు భయాలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సింహం: (పంచమ చంద్రుడు) పిల్లల పురోగతి ఆనందాన్నిస్తుంది. సృజనాత్మకతకు గుర్తింపు.
కన్య: (చతుర్ధ చంద్రుడు) గృహ, వాహన సంబంధిత పనుల్లో ఆటంకాలు. ప్రశాంతత లోపిస్తుంది.
తుల: (తృతీయ చంద్రుడు) సోదరుల సహకారం. ధైర్యంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం: (ధన చంద్రుడు) ఆర్థిక లాభం. కుటుంబంలో శుభకార్య ప్రస్తావన.
ధనుస్సు: (జన్మ చంద్రుడు) ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు.
మకరం: (వ్యయ చంద్రుడు) అనవసర ఖర్చులు. పుణ్యకార్యాలకు ధనం వెచ్చిస్తారు.
కుంభం: (లాభ చంద్రుడు) వృత్తి వ్యాపారాలలో లాభం. మిత్రుల ద్వారా సహాయం అందుతుంది.
మీనం: (దశమ చంద్రుడు) ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

CLICK HERE TO READ కుజదోషం అంటే ఏమిటి? లక్షణాలు, ప్రభావాలు, పరిహారాలు

CLICK HERE TO READ MORE

Leave a Reply