జ‌న‌ర‌ల్ అసిస్టెంట్‌లుగా 1258 మంది కార్మికులు

జ‌న‌ర‌ల్ అసిస్టెంట్‌లుగా 1258 మంది కార్మికులు

కాసిపేట, ఆంధ్రప్రభ : సింగ‌రేణి(Singareni) సంస్థ‌లో ప్ర‌మోష‌న్లు ఇస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్(open cast) గనులు, సర్ఫేస్‌లో డ్యూటీ లు చేస్తూ 190 అండర్ గ్రౌండ్, 240 ఉపరితలంలో మస్టర్లు పూర్తి చేసిన కార్మికులకు జనరల్ అసిస్టెంట్(Asst) కేటగిరీ -1 గా క్రమబద్ధీకరణ చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు విడుదల చేశారు.

2024 డిసెంబర్ 31 ముందు తమ సంవత్సరకాలం సర్వీసు చేసిన వారిని భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనుల్లో లేదా సర్ఫేస్ లో అయితే 240 మస్టర్లు పూర్తి చేసి ఉన్న బదిలీ వర్కర్లను జనరల్(General) అసిస్టెంట్ కేటగిరీ-1 గా క్రమబద్ధీకరించడానికి యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది.

ఏరియాల వారీగా అర్హత సాధించిన కార్మికుల వివరాలు. రామగుండం-2 ఏరియాలో 303 మంది, భూపాలపల్లి(Bhupalapalli) ఏరియాలో 250, శ్రీరాంపూర్ లో 241, రామగుండం-3, అడ్రియాల(Adriala) ఏరియాలలో 167, రామగుండం-1లో 156, మందమర్రిలో 64, కార్పోరేట్ లో 21, కొత్తగూడెం ఏరియాలో 20, మణుగూరు 19, బెల్లంపల్లి 11, ఇల్లందు ఏరియాలో ఆరు గురు కార్మికులు జనరల్ అసిస్టెంట్ కేటగిరీ-1గా క్రమబద్ధీకారణ పొందనున్నారు. వీటికి సంబంధించిన వ్యక్తిగత ఆర్డర్ పత్రాలు ఆయా గనుల, డిపార్ట్మెంట్ హెచ్ఓడీ(Department HOD)లు అందించనున్నారు.

Leave a Reply