బందెల సుభాష్ చివరి రోజు ప్రచారం

బందెల సుభాష్ చివరి రోజు ప్రచారం
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో బిజెపి అభ్యర్థి బందెల సుభాష్ తన చివరి రోజు ప్రచారంలో భాగంగా సోమవారం ఇంటింటికి వెళ్లి కార్యకర్తలతో కలిసి ఓటర్లను కలుసుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా గతం నుండి పనిచేసిన తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యులు పాల్గొన్నారు.
