11th ward | ప్రజా సేవే లక్ష్యంగా మీ ముందుకు…!

11th ward | ప్రజా సేవే లక్ష్యంగా మీ ముందుకు…!
- 11వ వార్డ్ బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పసల మరియన్న విజయ
11th ward | మోత్కూర్, ఆంధ్రప్రభ : విద్యాసంస్థల నిర్వాహకులుగా… నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైన తమను ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజా సేవే లక్ష్యంగా కృషి చేస్తామని 11వ వార్డు బీఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పసల మరియన్న విజయ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచార పర్వంలో బీఆర్ ఎస్ కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 11 ఓట్లతో ఓటమి పాలైన తమకు ఈ ఒక్క సారి అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే 11వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని … వార్డులో సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఈ నెల 11 న జరిగే పోలింగ్ లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
