116 municipalities | ముగిసిన మున్సిపల్ పోలింగ్..

116 municipalities | ముగిసిన మున్సిపల్ పోలింగ్..

116 municipalities | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.

మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2582 వార్డులకు గాను 12 వార్డులు ఏకగ్రీవం కాగా ఒక చోట వాయిదా పడింది. దీంతో ఇవాళ 2569 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన 414 వార్డుల్లో 2 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 412 వార్డులకు పోలింగ్ నిర్వహించారు.

పోలింగ్ సరణి తొలుత ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు, ఘర్ణణలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల రాజకీయ పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్లు ఈ నెల 13న లెక్కించనున్నారు.

Leave a Reply