10th Ward | ఆశీర్వదిస్తే సేవ చేస్తా…

10th Ward | ఆశీర్వదిస్తే సేవ చేస్తా…
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…
- గ్యాసు పొయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి
- .బోనగిరి మౌనిక రణధీర్.
10th Ward | ధర్మసాగర్, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన 10వ వార్డు(10th Ward) మెంబర్ అభ్యర్థిగా బోనగిరి మౌనిక రణధీర్ బరిలో ఉన్నారు. ఉన్నత విద్య అభ్యసించి, ప్రైవేటు టీచర్ గా పనిచేసిన అనుభవం, సామాజిక చైతన్యం కలిగిన దంపతులుగా వీరికి మంచి పేరు వుంది.
భర్త పాలుమారి రణధీర్ తో పాటు ధర్మసాగర్ గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. 10వ వార్డులో ఉన్న సమస్యల కొరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. మృదు స్వభావం, ఎవ్వరిని నొప్పివ్వని స్వభావం కలిగిన ఈ దంపతులకు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు.
