10th exames | చేతిరాత అందంగా ఉండాలి

10th exames | చేతిరాత అందంగా ఉండాలి

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పరీక్షలు రాసే స‌మ‌యంలో విద్యార్థులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అలాగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాసేట‌ప్పుడు చేతిరాత నీటుగా ఉంటే అత్యుత్త‌మ మార్కులు పొంద‌వ‌చ్చు. జవాబు పత్రంపై కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. చక్కని రాత వల్ల మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.

  • పరీక్ష కాపుట‌ప్పుడు పెన్నును గట్టిగా పట్టుకోకూడదు.
  • పెన్నును ఒత్తిపట్టి రాయకూడదు.
  • ఆన్స‌ర్ షీట్‌లో కుడివైపు ఒక అంగుళం, ఎడమవైపు సైతం అర అంగుళం ఖాళీ విడిచిపెట్టాలి.
  • బ్లాక్​, బ్లూ కలర్​ పెన్నులు మాత్రమే వాడాలి.
  • జవాబులు సోది లేకుండా సూటిగా రాయాలి.
  • జవాబు ప‌త్రంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి.
  • అక్షరాలు, పదాలు, వాక్యాల మధ్య తగినంత దూరం ఉండాలి.
  • ఒక పేజీలో 16 నుంచి 18 వరుసలు మించకూడదు.
  • జవాబు పత్రంలో సగం పదం పైన మరో స‌గం కింది వరుసలో రాయొద్దు.
  • సైన్స్ బొమ్మలు గీయ‌డానికి స్కెచ్​లు, కలర్​ పెన్నులు ఉపయోగించొద్దు.
  • అక్ష‌రాల‌న్నీ ఒకే సైజులో రాయాలి.
  • జవాబు పత్రంలో హెడ్​లైన్స్​, సబ్​హెడ్​లైన్స్ ఉండేలా చూసుకోవాలి.​

Leave a Reply