విద్యార్థులు ఇష్టపడి చదివి.. ఉత్తమ ఫలితాలు సాధించాలి

విద్యార్థులు ఇష్టపడి చదివి.. ఉత్తమ ఫలితాలు సాధించాలి

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి.. ఉత్తమ ఫలితాలను సాధించాలని 66 డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ సూచించారు. హసన్ పర్తి 66వ డివిజన్ లో పీఎంశ్రీ ప్రభుత్వ బాలికల,బాలుర ఉన్నత పాఠశాల వేడుకలను ప్రధానోపాధ్యాయునీరాలు ఎన్నం శెట్టి సుమాదేవి, ముద్దసాని విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షులు మారం తిరుపతి సహకారంతో ఉచితంగా పదవ తరగతి విద్యార్థినీ,విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేశారు.

ఈమేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ రాబోయే పరీక్షల్లో పదవ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రతి ఏడాది పాఠశాలలో నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల విద్యార్థుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపుతాయన్నారు. బాలికల ప్రదానోపాధ్యాయునీరాలు ఎన్నంశెట్టి సుమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయుల కృషి తల్లిదండ్రుల తోడ్పాటు, కృషితో అద్భుతాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.

మారం తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎల్లవేళలా కృషి చేయాలని కోరారు. వేడుకల్లో విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా విద్యా కమిటీ సభ్యులు చకిలం రాజేశ్వరరావు, దాసరి రాజు,మేకల హరిశంకర్, తాళ్ల శ్యామ్, కుంభకర్ సాయి, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లో కళాశాల యాజమాన్యంతో కలిసి కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ మొక్కలు నాటారు.

Leave a Reply