108 Vehicle | కరెంట్ షాక్ తో…

108 Vehicle | రాయపర్తి, ఆంధ్రప్రభ : కరెంట్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు శుక్రవారం కొండూరు గ్రామంలోని ఒక ఇంట్లో నీటి అవసరం కోసం బోరు వేశారు. బోరు వేసిన పని ముగిశాక పైపులు తదితర సామాగ్రి సర్దుకుంటుండగా హైమర్ కేబుల్ పక్కనే ఉన్న 11 కెవి విద్యుత్ లైన్(11 kV power line) బోరు బండి వాహనానికి తగిలి వాహన మొత్తానికి విద్యుత్ సరఫరా అయింది.

వాహనాన్ని(vehicle) పట్టుకుని ఉన్న రామ్ సింగ్(22) విద్యుత్ షాక్(electric shock)తో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి షాక్ కొట్టడంతో పరిస్థితి విషమంగా ఉంది. దాంతొ 108 వాహనం(108 vehicle)లో ఆసుపత్రికి తరలించారు. మృతుడు చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన వాడని బతుకుదెరువు కోసం వచ్చి బోర్ వెల్స్ లో పనిచేస్తున్నాడని వివరించారు.

Leave a Reply