108 vehicle | పలు వాహనాలను ఢీకొట్టిన సైకో…

108 vehicle | పలు వాహనాలను ఢీకొట్టిన సైకో…

చేతికి చిక్కకుండా చెరువులో హల్చల్..

108 vehicle | గంగవరం, ఆంధ్రప్రభ : మండలంలోని గంగవరం పంచాయతీ కేంద్రంలో మంగళవారం పోలీసు పెట్రోల్ వాహనాన్ని నడపడమే కాకుండా పలు వాహనాలను ఢీకొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసాడు. బెంగళూరు- తిరుపతి జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై వైఎస్ఆర్ సర్కిల్ నందు ఉంచిన పోలీసు పెట్రోల్ వాహనాన్ని పోలీసుల కళ్ళుగప్పి, స్థానికులు ఎంత నిలువరిస్తున్నా పట్టించుకోకుండా నడుపుకుంటూ వచ్చే క్రమంలో ఇక్కడి గంగవరం ఫ్లైఓవర్ వద్ద మొత్తం ఐదు వాహనాలను ఢీకొన్నాడు. ఇందులో ఒక కారు మరో టమోటాలు తరలిస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. కారులో వస్తున్న నలుగురిలో ఓ మహిళ, ఆటో డ్రైవర్ బాలాజీ గాయపడ్డాడు.

తరువాత పోలీసు వాహనాన్ని వదిలి సమీపంలోని చెరువులో దూకి ఈతకొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే చెరువులో నుండి బయటకు రాకుండా దాదాపు 2గంటలు అధికారులకు చుక్కలు చూపించిన సైకోను అత్యంత చాకచక్యంగా ఈతగాళ్ళ సహాయంతో పట్టుకుని బంధించారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం బంధించిన సైకోను 108వాహనం ద్వారా పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

108 vehicle | ఇంతకూ అధికారులు ఏమి చేస్తున్నారు ?

మండల కేంద్రంలో చుట్టుపక్కల దాదాపు రెండు రోజుల నుండీ తిరుగుతూ పిచ్చిపిచ్చిగా కన్నడ భాషలో మాట్లాడుతూ.. పలువురిపై దాడులు చేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. అయితే మంగళవారం మాత్రమే ఈ సైకో మరింతగా రెచ్చిపోయిన అతని ప్రవర్తన వింతగా ఉంది. అయితే ఇతను ఎక్కడి నుండి వచ్చాడని తెలియడం లేదు.

108 vehicle |

కాగా రెండు రోజులుగా పరిసరాల్లో ఉన్నాడని అధికారులకు తెలియదా అన్నది ఒక ప్రశ్నకాగా, అలాగే పోలీసు వాహనాన్ని ఒక అపరిచిత వ్యక్తి ఎక్కినడిపే ప్రయత్నం చేస్తున్నా అక్కడ పోలీసులు ఉన్నారా, లేదా? ఉంటే ఏమి చేస్తున్నారు? ఎందుకింత నిర్లక్ష్యం? రహదారిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఏమి చేస్తున్నట్లు? ఇటువంటి పలు ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాలి. అలాగే ఈ వాహనం నడుపుకొంటూ వచ్చి ఇతర వాహనాలను మాత్రమే ఢీకొన్నాడు. ఐతే అదృష్ట వశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరుగలేదు. అది మాత్రం కాస్త ఊరటనిస్తోంది.

108 vehicle |

108 vehicle | నిజంగా పిచ్చా లేక గంజాయి ప్రభావమా?

రెండు రోజుల నుంచి ఇదే ప్రవర్తనతో ఇక్కడ తిరుగుతూ ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చాడు. సరైన వస్త్రధారణ కూడా లేదు. దీనిని బట్టి అతనికి పిచ్చా లేక గంజాయి మత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడా అని కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తీసుకొని వచ్చారా? లేదా అతనే ఇక్కడికి వచ్చాడా? అతను సాధారణ స్థితిలోకి వచ్చిన తరువాత మరిన్ని విషయాలు పోలీసుల విచారణలో తెలియాలసి ఉంది. కాగా ఈ సైకోను బంధించడానికి పలమనేరు సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ లోకేశ్వర్ రెడ్డి,గంగవరం సిఐ.రాంభూపాల్, పలమనేరు అగ్నిమాపక ఇంచార్జి అధికారి నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

click here to read more : Telangana | భార్య పరిస్థితి విషమం…

click here to read more

Leave a Reply