100 Seats | మోడల్ స్కూల్ పిలుస్తోంది: 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలు

100 Seats | మోడల్ స్కూల్ పిలుస్తోంది: 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలు

  • ప్రతి మోడల్ స్కూల్‌లో 100 సీట్లు
  • ఆధునిక వసతులతో నాణ్యమైన విద్య
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదర్శ పాఠశాలలు
  • విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ
  • దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు

100 Seats | కుంటాల, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన, అత్యుత్తమ‌మైన బోధన ఉజ్వల భవిష్యత్తుకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలోని మండలానికి ఒక మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేసింది. అంచెలంచెలుగా ఎదుగుతూ మోడల్ స్కూల్ (Model School) కళాశాలలుగా అప్ గ్రేడ్ అయ్యాయి. ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి తీవ్ర పోటీ ఏర్పడింది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

100 Seats | ప్రతి ఆదర్శ పాఠశాలలో 100 సీట్లు..

రాష్ట్రవ్యాప్తంగా ఆరవ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. రెండు సెక్షన్ల‌లో 50 చొప్పున ప్రతి మోడల్ స్కూల్‌లో 100 సీట్లు ఉంటాయి. రిజర్వేషన్ కు (Reservation) అనుగుణంగా మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి ఆరో తరగతితో పాటు 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ప్రతి ఏటా ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సింది కానీ ఈసారి నెల రోజులు ఆలస్యమైంది. 5 తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఈ విద్యా సంవత్సరానికి ఎప్పటిలాగే ఆరో తరగతి నుంచి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

100 Seats

100 Seats | విద్యార్థులకు ఆదర్శలో అధునాత‌న‌మైన‌ వసతులు…

మోడల్ స్కూల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తుంది. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, నోట్ బుక్స్, యూనిఫామ్, బాలికలకు హాస్టల్ వసతి సౌకర్యం, డిజిటల్ తరగతులు, అధునాధనమైన ల్యాబ్, యోగా, కరాటే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి స్కూలుకు ఆర్టీసీ బస్సులను నడిపిస్తుంది. మండలంలోని అన్ని గ్రామాల నుంచి విద్యార్థులను (Students) స్కూలుకు ఉచితంగా తీసుకువచ్చి తిరిగి ఇంటి వద్దకు చేరవేసే విధంగా ఆర్టీసీ బస్సులను సైతం స్థానిక ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ విష‌యాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ దృష్టికి తీసుకు వెళ్లగా రెండు ఆర్టీసీ బస్సులు సైతం పాఠశాలకు సెలవులు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ పాఠశాల ఎదుట ఉంటాయి. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులు లేని గ్రామాల నుండి ప్రైవేటు వాహనాల‌లో సైతం ఆదర్శ పాఠశాలకు చేరుకుంటున్నారు.

100 Seats

100 Seats | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలలు…

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2013-14 విద్యా సంవత్సరంలో 194 ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. అయితే ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం లింగాపూర్ కోటపల్లి, కాసిపేట, మంచిర్యాల మందమర్రి, ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్, ఆదిలాబాద్ (Adilabad) గుడిహత్నూర్, జైనథ్ తో పాటు నార్నూర్, నిర్మల్ జిల్లాలోని కుంటాల, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ మండలాల్లో ఆదర్శ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో 6 నుంచి 10వ తరగతితో పాటు ఇంటర్ సైతం బోధిస్తున్నారు. ప్రతి పాఠశాలలో ప్రతి వంద మందిని ఆరవ తరగతిలో చేర్చించేందుకు ప్రతి ఏటా అవకాశం కల్పిస్తున్నారు. వీటిలో ప్ర‌వేశానికి తొలి పద్ధతిలో దరఖాస్తు స్వీకరించిన విధానాన్ని అమలు చేస్తున్నారు.

100 Seats

100 Seats | ఉత్తమ పరిణామాలతో…

ప్రత్యేక తరగతుల విద్యార్థులకు అత్యుత్తమ జీపీఎస్ సాధిస్తున్నారు. దీనికి తోడు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికైన బోధకులు శ్రద్ధ వహిస్తున్నారు. పిల్లలు ఆటలతో పాటు సంస్కృతిక కార్యక్రమాల అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. యానిమేషన్, బ్యూటిషన్, మైక్రో ఇరిగేషన్, మీడియా (Media) అండ్ ఇంటర్ ట్రైన్ మెంటు తదితర వాటిపై విద్యార్థులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్‌లో అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా ప్రతి కళాశాల నుంచి ఆరుగురికి ఎంసెట్ ఇంజనీరింగ్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

100 Seats | దరఖాస్తు చేసుకునే విధానం ఇలా…

ప్రభుత్వం (GOVT) గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్ లైన్ లోని https:tmgs.talangnana.gov.in దరఖాస్తు చేసుకోవాలని ఓసీలకు రూ. 200, బీసీ, ఎస్‌టీ, ఎస్‌సీ, ఈ డబ్ల్యూసీ, పిహెచ్ఎస్సి విద్యార్థులకు రూ.125 రుసుం చెల్లించాలి. ఆరవ తరగతికి తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో వంద మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

100 Seats

100 Seats | ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు

బంగారు భవిత్‌ కోసం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులు అర్హులైన తమ పిల్లలను ఆదర్శ పాఠశాలల్లో (Schools) చేర్పించడానికి కృషి చేయాలన్నారు. ఉన్నంత అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ కార్పొరేట్ స్థాయికి దీటుగా విద్యా బోధన అందిస్తున్నామన్నారు. అందరి చదువు మన అందరి బాధ్యత అనే నినాదంతో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో కృషి చేస్తుందని గడువులోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకుని కష్టపడి విద్యార్థులు చదివి సీటు పొందాలని, కష్టపడి చదువుతేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తుందని, విద్యతోనే విద్యార్థులకు పునాది అని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఎత్రాజ్ రాజు తెలిపారు.

CLICK HERE TO READ సుదీర్ఘ కాలం పరీక్షలు

CLICK HERE TO READ MORE

Leave a Reply