100 people | కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు

100 people | కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు

  • కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు
  • ఐదుగురికి మించి గుమి కూడరాదు
  • అనుమతి పత్రం ఉన్న వారికే కేంద్రంలో ప్రవేశం ఉంటుంది
  • శాంతియుత వాతావరణంలో లెక్కింపు నిర్వహణకు చర్యలు
  • కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్

100 people | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు పల్లగుట్ట క్రాస్ రోడ్డున ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం జనగామ డీసీపీ రాజ మహేంద్రనాయక్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన భద్రతా ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు విధానం, ఎన్నిక ల నిబంధనల అమలు తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రవేశ, నిష్క్రమణ మార్గా లు, అభ్యర్థులు, ఏజెంట్లకు కల్పించిన సౌకర్యాలు, బ్యాలెట్ బాక్సుల భద్రత వంటి అంశాలను డీసీపీ ప్రత్యేకంగా పరిశీలించారు.

ఓట్ల లెక్కిం పు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నకు అందరూ సహకరించాలని కోరారు. కౌంటింగ్ కేంద్ర పరిసర ప్రాంతా ల్లో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడరాదని, ఎలాంటి ర్యాలీలు, ఆందోళనలు, పటాకులు కాల్చడం వంటి కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

100 people |

రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు కలిగిన వారినే భద్రతా సిబ్బంది కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారని చెప్పారు. అనుమతి లేని వ్యక్తులు కేంద్రం వద్ద గుమికూడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కౌంటింగ్ ప్రక్రియను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు.

కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత కోసం ఒక ఏసీపీ, ముగ్గురు సీఐలు, తొమ్మిది మంది ఎస్‌ఐలు, 100 మంది పోలీ సు సిబ్బంది, 20 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, కేంద్ర బలగాల సిబ్బంది విధుల్లో ఉంటారని సీఐ జి. వేణు తెలిపారు. ఎన్ని కల లెక్కింపు పూర్త య్యే వరకు అప్రమత్తంగా ఉండి చట్టం, శాంతిభద్ర తలను కాపాడు తామని పేర్కొన్నారు.ఆయన వెంటా ఎస్ఐ లు వినయ్ కుమార్, నవీన్ కుమార్, మనీషా, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నా రు.

click here to read more :25%PunitiveTariffs | భారత్ మౌనం వెనుక వ్యూహమా?

click here to read more :

Leave a Reply