100 meters | సమర్థంగా ఎన్నికల నియమావళి

100 meters | సమర్థంగా ఎన్నికల నియమావళి

  • రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మధుకర్ బాబు

100 meters | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఎన్నికల నియమావళిని సమర్థంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల(State elections) పరిశీలకులు మధుకర్ బాబు అన్నారు. నర్సింహులపేట మండల కేంద్రంలో మూడవరోజు నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రక్రియను ఈ రోజు పరిశీలించారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్(Online)లో నమోదు చేయాలన్నారు.

పోటీ చేసే అభ్యర్థి బలపరిచే వ్యక్తిని మాత్రమే లోనికి అనుమతించాలని సిబ్బందికి సూచించారు. ఇతరులను క్లస్టర్ కేంద్రానికి 100 మీటర్ల(100 meters) దూరంలో ఉంచాలన్నారు. ఆయన వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మరియన్న, స్థానిక ఎంపీడీవో రాధిక(MPDO Radhika), ఎంపీఓ కిన్నర యాకయ్య, తదితరులున్నారు.

Leave a Reply