100 days | డబుల్ రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వీడండి.

100 days | డబుల్ రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వీడండి.

100 days | గన్నేరువరం, ఆంధ్రప్రభ : హ్యాపీ హోలీ అంటూ రంగుల పండుగ జరుపుకుంటున్న పాలకులు, గన్నేరువరం మండలంలో డబుల్ రోడ్డు పై రక్త హోలీ జరుగుతుందని, హోలీ పండుగ సందర్భంగా వినూత్న నిరసన తెలిపారు బీజేపీ నియోజక వర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గుండ్లపల్లి – పొత్తూరు రహదారి దుస్థితిని నిరసిస్తూ నడి రోడ్డుపై ఆందోళనకు దిగిన ఆయన, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు ఉన్న ఈ డబుల్ రోడ్డు కోసం దశాబ్దాలుగా ప్రజలు వేచిచూస్తున్నారు.

100 days | 100 రోజుల్లో రోడ్డు నిర్మిస్తా

ప్రతి ఎన్నికల సమయంలో హామీలు… ప్రతి ప్రభుత్వంలో శంకుస్థాపనలు… కానీ ప్రజలకు మాత్రం గాయాలు, ప్రమాదాలే మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం 71 కోట్ల రూపాయల జి.ఓ. తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ప్రచారంతో సరిపెట్టుకుందని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే “100 రోజుల్లో రోడ్డు నిర్మిస్తా” అని హామీ ఇచ్చి, ఉన్న రహదారినే చెడగొట్టి కంకర పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.

నిత్యం ఆ కంకర రాళ్లు ఎగిరిపడి చిన్నారులు, వృద్ధులు గాయపడుతున్నారని. తన మొఖంపై ఉన్న హోలీ రంగులా ప్రజల ముఖాలపై రక్తపు మచ్చలు పడుతున్నాయి. ఓట్లేసిన పాపానికి ప్రజలు రక్తం కళ్లతో చూడాలా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. వర్షాకాలం వస్తే మండలం మొత్తం జలదిగ్బంధనానికి గురవుతుందని, అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు.

100 days |

ఈ రహదారి కేవలం అసౌకర్యం కాదు– ఇది ప్రాణహాని అని, ప్రతి రోజు ప్రమాదాల అంచున ప్రజలు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల ప్రాణాలు కూడా విలువైనవేనని, వెంటనే రహదారి నిర్మాణం ప్రారంభించకపోతే ప్రజల ఆగ్రహం గతం కంటే ఎక్కువ చూడాల్సి వస్తుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. స్థానిక ప్రజలు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Leave a Reply