భవిష్యత్తుకు బలమైన పునాదులు….

భవిష్యత్తుకు బలమైన పునాదులు….

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

మైలవరం, ఆంధ్రప్రభ : ఏపీ రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బలమైన పునాదులు వేస్తోందని, దీంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. మైలవరం మండలంలోని పొందుగల గ్రామంలో రూ.36 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.12 లక్షల ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారిని ప్రారంభించారు.

తొలుత గ్రామంలో శివాలయంలో స్వామివారిని, దేవతా మూర్తులను దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ద్వారా ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా దార్శనికులు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఒక్క మార్చి నెలలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని అమలు, 10 వేల పోస్టులతో భారీ జాబ్ క్యాలెండరు, ఏటా డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.

ఇమామ్లు, మౌజన్ల వేతనాలు రూ.45 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అయిన స్త్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2.0, అన్నదాత సుఖీభవ, పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన హామీలే కాకుండా, ఇవ్వని హామీలను కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు పేదల సంక్షేమ పథకాల అమలుకు సుమారు రూ.ఇప్పటికి మొత్తం రూ.446.05 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశామన్నారు.

పల్లెపండుగలో భాగంగా రూ.32.92కోట్లతో సీసీ రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply