10 lakh donation | ఆలయానికి 10 లక్షల విరాళం..

10 lakh donation | ఆలయానికి 10 లక్షల విరాళం..

10 lakh donation | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 10 లక్షల విరాళం(10 lakh donation) అందజేయడానికి ఎగుమామిడి వెంకటరమణా రెడ్డి, కృష్ణా రెడ్డి, విజయేందర్ రెడ్డి సోదరులు కామినేని శ్రీనివాస్, శ్రీధర్ సోదరులు ముందుకు వచ్చారు.

ఈ మేరకు లక్ష్మీ నరసింహ స్వామి ద్వితీయ బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించడానికి రథం,రథం పెట్టడానికి షెడ్ నిర్మాణం(shed construction), ప్రాణ ప్రతిష్ట కు 10 లక్షల రూపాయలు అవసరం అవుతుంది విరాళాలు ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని దేవస్థాన ప్రతిష్టాపకులు శ్రీమాన్ శ్రీ నమిలి కొండ రమణాచారి పిలిపివ్వగా ఎగు మామిడి సోదరులు, కామినేని సోదరులు ముందుకు వచ్చి ఖర్చులు అందజేస్తామని ప్రకటించారు.

లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధికి ముందుకు వచ్చిన విరాళం దంపతులను శ్రీమాన్ శ్రీ నమిలి కొండ రమణాచారి, దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,గ్రామసులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply