10grams gold| భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

10grams gold| భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం, వెండి ధరలు ప్ర‌తీరోజు హెచ్చుత‌గ్గుద‌ల‌తో ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు నేల చూపు చూశాయి. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే అంశంగానే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు భారీగా పడిపోయాయి. ఈ ప్రభావం త్వరలోనే దేశీయ మార్కెట్లో కూడా కనిపించే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఇటీవల పరిస్థితులు కొంతవరకు సద్దుమణిగే సూచనలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 57 డాలర్లు పడిపోయి 4618 డాలర్ల స్థాయికి చేరింది. అలాగే స్పాట్ సిల్వర్ ధర కూడా 1.13 శాతం మేర తగ్గి ఔన్సుకు 72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

నేటి బంగారం ధరలు (10 గ్రాములు):

24 క్యారెట్ల బంగారం: రూ. 1,800 తగ్గి రూ. 1,49,130 వద్దకు చేరుకుంది.
22 క్యారెట్ల బంగారం: రూ. 1,650 తగ్గి రూ. 1,36,700 వద్ద కొనసాగుతోంది.

వెండి ధ‌ర‌లో మార్పు లేదు :
బంగారం ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ, వెండి ధర వరుసగా నాలుగో రోజు కూడా స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,55,000గా ఉంది.

Leave a Reply