అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
- ఆదరించి అండగా నిలిచి గెలిపించండి
- 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్టా సురేష్ కుమార్ గుప్తా
- రైటప్: తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరుతున్న 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ట సురేష్ కుమార్ గుప్తా
మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మున్సిపల్ అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమని అందుకే ఈ ఎన్నికల్లో తమను ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని 1వ వార్డు మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థి కట్ట సురేష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మక్తల్ పట్టణంలోని 1వ వార్డు పరిధిలోని టీచర్స్ కాలనీలో తన మద్దతు దారులతో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .ఇంటింటికి వెళ్లి ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే చేపట్టనున్న అభివృద్ధి పనులను వివరించి ఓట్లు అడిగారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో మక్తల్ పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుకుందామని ఓటర్లకు వివరించారు .అభివృద్ధి కోసం ఎన్నికల్లో తనను ఒకటవ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు .అభివృద్ధి సంక్షేమం అధికార పార్టీతోనే సాధ్యమన్నారు .ఇప్పటికే మక్తల్ పట్టణంలో మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీలు తాగునీటి పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు .
మరింత అభివృద్ధి కోసం ఎన్నికల్లో తనను ఒకటవ వార్డు కౌన్సిలర్ గా గెలిపించడమే కాకుండా 16 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఒకటవ వార్డు అభ్యర్థి కట్టా సురేష్ కుమార్ గుప్తా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు . స్థానికుడు మంత్రిగా ఉండటం వల్ల మక్తల్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గొప్ప అవకాశం ఉందన్నారు .
ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే గౌస పడడం తప్ప మరో మార్గం లేదన్నారు. అందుకనే ప్రతిపక్ష పార్టీల నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడ్డ వద్దని ఆయన సూచించారు. అభివృద్ధి కోసం ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటు వేసి ఒకటవ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని కట్టా సురేష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పసుల రంజిత్ రెడ్డి ,మేదరి శ్రీనివాస్ ఇతర నాయకులు ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు.
