1 Lakh Iran Human Shield : అదే బసిజ్​ Andhra Prabha SPL Story

1 Lakh Iran Human Shield : అదే బసిజ్​ Andhra Prabha SPL Story

  • ఇరాన్​ కవచం
  • ఆత్మాహుతి దళం
  • ఐఆర్జీసీ ఆయువు పట్టు
  • యుద్ధంలో లక్షమంది బాలలు
  • ఇరాన్‌ కొత్త యుద్ధ వ్యూహం
  • ‘ఫాంటమ్ కంట్రోల్’ వ్యూహం
  • పెంటగాన్‌కు కొత్త సవాళ్లు
  • AIతో ఎదురుదాడి
  • అమ్నెస్టీ ఆందోళన

( ఆంధ్రప్రభ, టెహ్రాన్​ ప్రతినిధి )

1 Lakh Iran Human Shield

ఆపరేషన్​ ఎథిక్​ ప్యూరీలో అమెరికా, ఇజ్రాయెల్​ ఆశలు అడియాశలుగా మారబోతున్నాయి. ఇరాన్​ అసలు లొంగటం లేదు. ప్రపంచ దేశాలే.. తాజాగా బిక్కచచ్చిపోతున్నాయి. గల్ఫ్​ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. 15000 మంది అత్యాధునిక టెక్నాలజీ హీరోలను రంగంలోకి దించిన అమెరికా.. ఏ విధంగా ముందుకు సాగాలో అర్థం కాక సతమతమవుతోంది. ఎందుకంటే..

1 Lakh Iran Human Shield

ఏ మాత్రం ఏమరుపాటుతో ఇరాన్​ పై దాడికి దిగితే.. ప్రపంచ దేశాలన్నీ ఈసడించుకునే స్థితి ఏర్పడుతుంది. మానవ హక్కుల సంఘాలు అమెరికాను తూర్పారపడతాయి. అదేంటీ .. అనుకుంటున్నారా? ఔను ఇరాన్​ యుద్ధ వ్యూహం అంతే.. తాజాగా ఇరాన్​ రక్షణ వలయంలో.. బాలదండును ఇరాన్​ రంగంలోకి దించింది. అమ్నెస్టీ నివేదిక ప్రకారం, ఇరాన్​ లో లక్ష మంది బాలలు తుపాకులు పట్టి పహరా కాస్తున్నారు. . వీరి మీద దాడి చేయటం యుద్ధ నీతి కాదు. ఈ స్థితిలోనే అమెరికా ఏం చేయాలో పాలుపోక.. రాజీ తంత్రం ప్రయోగించక తప్పలేదు. ఇంతకీ ఇంత పెద్ద అమెరికా సైనికులను ఈ బాల దండు ఎలా ఎదుర్కొంటుంది. అసలీ బాలదండు కథేంటీ?

1 Lakh Iran Human Shield : రంగంలో బాసిజ్​ దళం

1 Lakh Iran Human Shield

ఎనిమిదేళ్ల పాటు ఇరాక్​ ను ముప్పు తిప్పలు పెటిన ఇరాన్​ బలం బలగం.. ఐఆర్​ జీసీ అని అందరూ అనుకుంటారు. కానీ ఇదే ఐఆర్​ జీసీ ఆయువు పట్టు ఎవరో తెలుసా? బసీజ్​ దళం. బాలల సైన్యం. 46 ఏళ్ల కిందటే 5.5 లక్షల మంది బాసిజ్​ దళం ఇరాక్​ యుద్ధంలో పాల్గొంది. 40 వేల మంది బాలలు నేలకొరిగారు. మళ్లీ ఇదే వ్యూహంతో అమెరికా, ఇజ్రాయెల్​ తో ఇరాన్​ తలపడుతోంది. అందుకే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా ఇతర అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఇరాన్ సైనిక చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుత యుద్ధం (ఏప్రిల్ 2026) నేపథ్యంలో ఇరాన్ తన బసిజ్ దళాల్లోకి చిన్న పిల్లలను చేర్చుకుంటున్నట్లు నివేదికలు వెలువడ్డాయి.

1 Lakh Iran Human Shield : బసిజ్​.. అంటే..

1 Lakh Iran Human Shield

బసిజ్ అనేది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అనుబంధ స్వచ్ఛంద పారామిలిటరీ దళం. ఇది దేశీయ భద్రత, నైతిక పోలీసు విధులను నిర్వహిస్తుంది. యుద్ధ సమయాల్లో వీరు ఫ్రంట్​ లైన్​ ​ సైనికపాత్ర పోషిస్తారు.మ్నె1 Lakh Iran Human Shield : స్టీ నివేదిక ప్రకారం, ఇరాన్ ప్రభుత్వం 12 నుంచి 15 ఏళ్ల లోపు మైనర్లను “స్వచ్ఛంద సేవకులు” బురఖాలో యుద్ధ రంగంలోకి దించుతోంది. ఈ పిల్లలకు ప్రాథమిక ఆయుధ శిక్షణ ఇచ్చి, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా , యుద్ధ భూమిలో ఇతర పనులకు ఉపయోగిస్తున్నారు.

1 Lkh Iran Human Shield : అంతర్జాతీయ చట్టాలు గాలికి..

1 Lakh Iran Human Shield

:15 ఏళ్ల లోపు వయస్సు బాలలను సైన్యంలోకి తీసుకుని, యుద్ధ కార్యకలాపాల్లోకి దించటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం “యుద్ధ నేరం” ఐక్యరాజ్యసమితి పిల్లల హక్కుల కమిటీ కూడా ఇరాన్‌ను ఈ విషయంలో గతంలోనే హెచ్చరించింది. చిన్న పిల్లలను యుద్ధ ట్యాంకులు లేదా పేలుడు పదార్థాల దగ్గర మోహరించడం బాలల ప్రాణాలకు తీవ్ర ముప్పు అని పేర్కొంది.

1 Lakh Iran Human Shield : టెహ్రాన్​ పాచిక ఇదే

1 Lakh Iran Human Shield

అమెరికాతో యుద్ధం తీవ్రమవ్వడంతో ఇరాన్ తన సౌనిక సంఖ్యా బలాన్ని పెంచటానికి మళ్లీ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా దళాల కదలికలను పసిగట్టటానికి ఈ చిన్నారులను “హ్యూమన్ షీల్డ్” ప్రయోగిస్తున్నట్టు కొన్ని స్వతంత్ర మీడియా సంస్థలు కూడా ఆరోపించాయి. ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తాము కేవలం 18 ఏళ్లు నిండిన యువకులనే రక్షణ విధుల్లోకి తీసుకుంటున్నామని, బసిజ్ అనేది కేవలం సామాజిక సేవ చేసే దళం అని వాదిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్​ దాడులతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతల దృష్ట్యా స్వచ్ఛంద దళాల్లో చేరే స్వచ్ఛంధ సైనికుల కనీస వయస్సును 12 ఏళ్లకు తగ్గించారు. .2026 మార్చి 26న ఇదే విషయాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారి రహీమ్ నదాలీ ప్రకటించారు.

1 Lakh Iran Human Shield : బాల దండు అవస్థలెన్నో…

1 Lakh Iran Human Shield

ప్రస్తుత యుద్ధ కాలంలో… బాల దండు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. భుజాపై మోలేని ఏకె 47 గన్​ లు.. శత్రువులను పసిగట్టే పహారాలో నిలువువాళ్ల చాకిరి.తో బాల సైన్యం అల్లాడిపోతోంది. టెహ్రాన్, కరాజ్, రష్త్ నగరాల్లోని సెక్యూరిటీ చెక్‌ పోస్టుల్లో 18 ఏళ్ల లోపు బాలలు తుపాకులు పట్టుకుని విధులు నిర్వహిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యాలు వీడియో ఆధారాలు లభించాయి. మార్చి 11, 2026న డ్రోన్ దాడిలో టెహ్రాన్‌లోని ఒక చెక్‌పోస్టు దగ్గర విధుల్లోని 11 ఏళ్ల అలీరెజా జాఫరీ మరణించినట్లు నివేదికలు ధృవీకరించాయి.
టెహ్రాన్​ లో AK-47 అటాల్ట్ రైఫిళ్లను ధరించిన బాలలు , IRGC సిబ్బందితో కలిసి చెక్-పోస్టుల వద్ద కనిపించారు. మార్చి 30న మాష్‌హద్‌ నగరంలో తీసిన ఒవీడియోలో, బసిజ్ యూనిఫాం ధరించిన ఇద్దరు బాలలు అటాల్ట్ రైఫిళ్లతో వాహనంపై కనిపించారు. మార్చి 25న టెహ్రాన్‌లోని ఒక చెక్-పోస్ట్ వద్ద సుమారు 15 ఏళ్ల బాలుడిని ఓ సాక్షి చూశారు.

1 Lakh Iran Human Shield

ఆ బాలుడు తుపాకీ బరువును మోయలేక ఇబ్బంది పడుతూ, వెళ్తున్న కార్ల వైపు తుపాకి గురిపెడుతున్నట్లు సాక్షి వివరించారు. కరాజ్ నగరంలో మీసాలు కూడా రాని ఒక టీనేజర్ కలష్నికోవ్ రైఫిల్ పట్టుకుని చెక్-పోస్ట్ వద్దకాపలా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రష్త్ నగరంలో ముఖానికి మాస్క్‌లు ధరించిన సుమారు 13 ఏళ్ల బాలలను ఇతర దళాల కంటే ముందు వరుసలో మోహరించినట్లు సాక్షులు పేర్కొన్నారు. ఇరాన్​ మాత్రం తాము బాలలను సైన్యంలోకి తీసుకోలేదని గట్టిగా వాదిస్తోంది.

1 Lakh Iran Human Shield : ఈ​ వ్యూహం సెపరేట్​ గురూ

1 Lakh Iran Human Shield

ఇరాన్ తన అణు కేంద్రాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, సైనిక స్థావరాల సమీపంలో బాలల దళాలను (Basij) మోహరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చిన్న పిల్లలు ఉన్న చోట డ్రోన్ దాడులు లేదా వైమానిక దాడులకు అమెరికా వెనకాడుతుందని, తద్వారా తమ సైనిక ఆస్తులను కాపాడుకోవచ్చని ఇరాన్ భావిస్తోంది. ఒకవేళ అమెరికా దాడుల్లో పిల్లలు చనిపోతే, ఆ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై (UN వంటివి) చూపిస్తూ అమెరికాను “యుద్ధ నేరస్థుని”గా చిత్రీకరించవచ్చనేది ఇరాన్ ఎత్తుగడ అని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో జరిగినట్లే, ఇప్పుడు కూడా కొంతమంది మైనర్లను ఆత్మాహుతి దళాల రూనంలొ అమెరికా ట్యాంకులను అడ్డుకోవడానికి సిద్ధం చేస్తున్నట్లు కొన్ని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

1 Lakh Iran Human Shield : ఆమ్నెస్టీ ఆందోళన

1 Lakh Iran Human Shield

ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఇరాన్ IRGC (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) తన అనుబంధ విభాగం బసిజ్ (Basij) దళం కోసం సుమారు ఒక లక్ష (1,00,000) మంది బాలలను సేకరించినట్టు అమ్నెస్టీ తన నివేదికలో అంచనా వేసింది. . దేశవ్యాప్తంగా దాదాపు 40,000 పాఠశాలలను బసిజ్ రిక్రూట్‌మెంట్, శిక్షణ కేంద్రాలుగా మార్చారని ఆమ్నెస్టీ ఆరోపించింది. నిరు పేద కుటుంబాల బాలలకు నెలకు సుమారు $100 నుంచి $150 వరకు జీతం ఇస్తామని, మరణిస్తే కుటుంబాలకు ప్రత్యేక గౌరవం ఆర్థిక సాయం అందుతుందని హామీ ఇచ్చి ఈ నియామకాలు చేపడుతున్నారు. ప్రస్తుత నివేదిక ప్రకారం, 12 ఏళ్ల పిల్లలను కూడా సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద ఉంచడంతో యుద్ధంలో ప్రత్యక్షంగా బాధితులు అవుతున్నారు. ఇది జెనీవా కన్వెన్షన్ నిబంధనలకు విరుద్ధమని, పిల్లలను రక్షణ కవచాలుగా వినియోగం అత్యంత క్రూర చర్య అని ఆమ్నెస్టీ పేర్కొంది.

1 Lakh Iran Human Shield : ఫాంటం కంట్రోల్​…

V

ఇరాన్ తన రక్షణ వ్యవస్థను కాపాడుకోవడానికి ఇది ఓ వినూత్న యుద్ధ వ్యూహం ఇది. “డిజిటల్ అండ్ ఫిజికల్ డిసెప్షన్” అని కూడా పిలుస్తారు. నిజమైన క్షిపణి లాంచర్లు అణు కేంద్రాలను తలపించే రీతిలోఎ ప్లాస్టిక్ లేదా ఫైబర్ నమూనాలను యుద్ధ క్షేత్రంలో ఉంచుతారు. ఇవి అమెరికా డ్రోన్లకు శాటిలైట్లకు యుద్ధ సామాగ్రిలా కనిపిస్తాయి . ఈ నకిలీ లక్ష్యాల వద్ద బసిజ్ (Basij) దళాలను సామాన్య ప్రజలను ఉంచుతారు. అమెరికా క్షిపణులు దారి తప్పేలా చేయడానికి రేడార్లను తప్పుదోవ పట్టించే సిగ్నల్స్‌ను ఇరాన్ పంపిస్తుంది.

1 Lakh Iran Human Shield : పెంటగాన్ తిప్పలే తిప్పలు

1 Lakh Iran Human Shield

ఇరాన్ ‘ఫాంటమ్ కంట్రోల్’ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి అమెరికా ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. నకిలీ లక్ష్యాలకు, అసలు లక్ష్యాలకు మధ్య తేడాను గుర్తించడానికి అమెరికా ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) కలిగిన అత్యాధునిక సెన్సార్లను వాడుతోంది. ఇవి ఉష్ణోగ్రత, పదార్థం (మెటల్ లేదా ప్లాస్టిక్) ఆధారంగా నిమిషాల్లో నిజాన్ని తేల్చేస్తాయి. “పిల్లలను మానవ కవచాలుగా వాడటం ఆపకపోతే, ఆ కేంద్రాలపై జరిగే దాడులకు ఇరాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని పెంటగాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధ భూమిలో పిల్లలను ఉంచడం వల్ల దాడులు ఆపబోమని స్పష్టం చేసింది.
ఇరాన్ లోపల కదలికలపై అమెరికా గూఢచారి వ్యవస్థను (CIA) మరింత బలోపేతం చేసింది. ఈ వ్యూహాలతో యుద్ధం మరింత సంక్లిష్టంగా మారింది. ఇరాన్ తన ప్రజలను అడ్డుపెట్టుకుని అమెరికాను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. అమెరికా తన సాంకేతిక పరిజ్ఙానంతో అడ్డంకులను దాటాలని ప్రయత్నిస్తోంది.

Leave a Reply