1 Chance | ఒక్క చాన్స్ ఇవ్వండి..

1 Chance | ఒక్క చాన్స్ ఇవ్వండి..

  • అభివృద్ధికి బాటలు వేస్తా.
  • ఎంపీటీసీగా ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులతో గ్రామ రూపురేఖలు మారాయి
  • ప్రైమరీ స్కూల్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి కృషి.
  • దుబ్బతండా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోత్ బుల్లిని గెలిపించండి.
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్,

1 Chance | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క చాన్స్ ఇచ్చి గెలిపిస్తే.. గ్రామ పంచాయతీ అభివృద్ధికి బాటలు వేస్తానని సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న బానోత్ బుల్లి ప్రజలను కోరుతున్నారు. ఇవాళ‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ స్థానానికి పోటీచేస్తున్న బుల్లి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బుల్లి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,కాకర్ల మాజీ ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకర్ల సర్పంచ్ స్థానానికి బుల్లి పోటీ చేస్తున్నారని తెలిపారు.

ఎంపీటీసీగా, గత ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో గెలిపించిన సర్పంచ్ నిధులతో చేపట్టిన అబివృద్ధి పనులతో గ్రామ పంచాయతీ రూపురేఖలు మార్చామన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన కోట్లాది రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీలు, వేణుగోపాల స్వామి ఆలయంపై సిమెంట్ రహదారి, కల్వర్టుల నిర్మాణం చేశామని సతీష్ ఓటర్లకు వివరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బానోత్ బుల్లిని సర్పంచ్ గా గెలిపిస్తే ప్రైమరీ స్కూల్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని పొన్నెకంటి సతీష్ హామీ ఇచ్చారు.

దుబ్బతండా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. గ్రామ పంచాయతీలో మిగిలి పోయిన సీసీ రోడ్లు, వీధి దీపాలు, గ్రామ పంచాయతీ అభివృద్ధికి వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సహకారంతో నిధుల మంజూరుకు పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుల్లి వార్డు సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పంచాయతీ ఓటర్లకు సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply