1.50 lakh people | శైవ క్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు…

1.50 lakh people | శైవ క్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు…

1.50 lakh people | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ సాయివక్షేత్రాలు శ్రీశైలం మహానంది యాగంటి ఓంకారం వంటి క్షేత్రాలలో భక్తులు అధిక సంఖ్యలో శివుని దర్శనం కోసం వస్తున్నారు. ప్రతి శివాలయములో పోటెత్తిన భక్తులు. జ్యోతిర్లింగాలలో ప్రధానమైన ఆరవలింగమైన నంద్యాల జిల్లాలో వెలిచిన శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ రోజైన ఆదివారం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయని కార్యనిర్మాహ ణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలంలో ఆదివారం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం చండీస్వర పూజ మండపారాధన ఆరాధన పంచవా వారు నార్చనలు ఇపానష్టాలు రుద్ర పారాయణలో వంటి కార్యక్రమాలతో రుద్ర హోమం,చండీ హోమం వంటి ప్రత్యేక కార్యక్రమాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ అక్రమంగా దర్శనం కలిగేలా అధికారులకు సూచనలు ఇస్తున్నరు.

1.50 lakh people |

లైన్లో నిర్వహిస్తున్న భక్తుల ఖండిస్తున్న ఆకులలో భద్రత మరియు ఇతర సదుపాయాలు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేయబడ్డాయన్నారు .అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు శాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి.

1.50 lakh people |

గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేయబడ్డాయన్నారు.

1.50 lakh people |

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రోజు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం 1.50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు అయినప్పటికీ అంతకంటే ఎక్కువ మంది భక్తులు రావడం విశేషం. వీరందరికీ క్యూలైన్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు శనివారమే శ్రీశైలంకు చేరుకోవడం విశేషం. శ్రీశైలంలో మొదటి రోజు శివ స్వాములపై పోలీసుల లాఠీచార్జి సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

1.50 lakh people |

ఇప్పటికే ఈ సంఘటనపై అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ విజయ్ కుమార్ ను అప్పటికప్పుడు బదిలీ చేశారు. వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అప్రమత్తమవుతున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి శివరాత్రి ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.

1.50 lakh people |

ఆదివారం శ్రీశైల దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్, అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, పాతాళగంగ స్నాన ఘట్టాలు, వసతి గృహాలు, ప్రధాన రహదారులు తదితర ప్రాంతాల్లో పరిస్థితులను జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణను క్రమబద్ధంగా చేపట్టాలని, ప్రతి స్లాట్‌లో దర్శనాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

1.50 lakh people |

భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు, శానిటేషన్, లైటింగ్ వంటి మౌలిక వసతులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ఫైర్ సిబ్బంది, వైద్య బృందాలు, పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు శాఖ అధికారులకు సూచిస్తూ, భక్తుల వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలాలు ఏర్పాటు చేసి, రవాణా అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు.మహాశివరాత్రి పర్వదినం రోజున లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి తరలివస్తారని అంచనా ఉన్నందున, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

పాతాళ గంగ వద్ద పోటెత్తిన భక్తులు..

శ్రీశైలంలో అమ్మవారి దర్శ నం మన పాతాళ గంగ స్నానాలలో భక్తులు పోటెత్తారు. వీరి కోసం ప్రత్యేక స్నానాల ఘట్టాలను అమర్చారు. భక్తులకు మహిళలకు ప్రత్యేకంగా డ్రెస్ రూములను ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లు ను ఏర్పాటు చేశారు. ఒక కంచన మార్చారు కంచ దాటి లోపలికి వెళ్లకుండా భక్తులకు కోసం సిబ్బంది కాపలాగా ఉన్నారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది తర లి రావడం విశేషం.

Leave a Reply