అంగన్వాడి కేంద్రాల పనితీరు మెరుగుపరచడానికి మొబైల్స్ …

అంగన్వాడి కేంద్రాల పనితీరు మెరుగుపరచడానికి మొబైల్స్ …
జైనూర్, ఆంధ్రప్రభ : అంగన్వాడి కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించడానికి కేంద్రాల పని మెరుగుపరచడానికే ప్రభుత్వం అంగన్వాడి టీచర్లకు మొబైల్స్ అందించడం జరుగుతుందని జై నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమేత విశ్వనాథరావు జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొ డప ప్రకాష్ అన్నారు. బుధవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో జైనూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్ల లతో ఏర్పాటు చేసిన సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
(ఏ డబ్ల్యు టి ఎస్ ) సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా చేయడానికి అంగన్వాడి టీచర్లకు సిడిపిఓ ఇందిర ఆధ్వర్యంలో ఆధునిక మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని మొబైల్ ద్వారా సేవలు అందించాలని వారు కోరారు. సిడిపిఓ ఇందిరా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు పోషణ కార్యక్రమాలు గ్రోత్ మానిటరింగ్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ వంటి సేవలను సమగ్రంగా నమోదు చేయాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమ0లో జైనూర్ మాజీ వైస్ ఎంపీపీ మాజీ చిర్లే లక్ష్మణ్ యాదవ్ కాంగ్రెస్ యువ నాయకులుమెస్రం అంబాజీరావు, సిర్పూర్( యు) మండలం పంగిడి సర్పంచ్ ఆ త్రం మీరా జాలింషా, ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని సెక్టార్ల సూపర్వైజర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
