ఘనంగా బాపూజీ జయంత్యుత్సవం
జగిత్యాల, ఆంధ్రప్రభ : కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్(District Collector B. Satyaprasad) అన్నారు. ఈ రోజు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంత్యుత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్(Satyaprasad) పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, బి. రాజా గౌడ్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్, జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, ఏవో హకీమ్(AO Hakeem), జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో…
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని సిరిసిల్ల రాజన్నజిల్లా ఎస్పీ మహేష్(SP Mahesh) పేర్కొన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం(Police Office)లో చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అనంతరం మాట్లాడుతూ బాపూజీ ఆశయాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య(SP Chandraiah), స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, ఏ.ఓ పద్మ( AO Padma), జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కమ్మర్పల్లిలో …
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి( Mutyala Sunil Kumar Reddy) ఘనంగా నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద పూలమాలవేసి, జయంతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న(Sunketa Buchchanna), పడిగేల ప్రవీణ్,నూకల బుచ్చి మల్లయ్య,సుంకేట శ్రీనివాస్, సల్లూరి గణేష్ గౌడ్,పూజారి శేఖర్,రంజిత్, వేములవాడ జగదీష్,అబ్దుల్ అజహారోద్దీన్, నాయకులు మరియు పద్మశాలి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

