Zaynur | సీట్ విచారణపై నిరసనలు

Zaynur | జైనూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు ఉద్యమకారుడుకల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిఆదేశాల మేరకు జైనూర్ మండలంలోని గూడమామడ, పట్నాపూర్, శివునూర్, పానాపటార్, జామిని, అడ్డెసార, డబోలి, జండగూడ తదితర గ్రామపంచాయతీలో సిర్పూర్ మండలంలోని సిర్పూర్ (యు), పుల్లారా, సీతగొంది బాండేర్, పవర్ గూడ తదితర గ్రామాల్లో సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు ప్రజలు నల్లజెండాలతో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచులు, నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీల అమలుపై ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే వాటి నుండి దృష్టి మార్చాడానికే కేసీఆర్పై సిట్ నోటీసుల పేరుతో ప్రభుత్వం ద్వారాముఖ్యమంత్రి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కుట్రలతో ప్రతి పక్షగొంతు నొక్కలేరని, చేస్తున్న కుంభకోణాలపై, విఫలమైన హామీలపై తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జైనూర్, సిర్పూర్ (యు) బీఆర్ఎస్ పార్టీఅధ్యక్షుడు ఇంతియాజులాల, తొడసం ధర్మారావు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఆత్రం.శంకర్ కొలాం, కుమ్ర భీమ్రావు, గ్రంథాలయ మాజీ చైర్మన్ కనక యాదవరావు, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మడవి భీమ్రావు, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు కుమ్ర భగవంతరావు, మాజీ ఎంపీటీసీ జుగాది రావు, సర్పంచులు కుమ్ర యశోద కేశవ్, జాదవ్ శ్రవణ్, దేవుశావ్, అడ్డ సార మాజీ సర్పంచ్ రామ్ షా, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మెస్రం రాహుల్, ముండే సమాధాన్, ముండే సతీష్, మారు, చంద్రకాంత్, పాన పటార్, పెద్దలులక్ష్మణ్, బాలు, భీంరావ్, లచ్మా, రాము, భీంరావ్, సుధాకర్, లచ్చు, కృష్ణ, తుకారాం, కేశవ్రావ్, రాందాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
