(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఒకవైపు ఎరువుల కొరత.. మరోవైపు లభించని గిట్టుబాటు ధర.. ఇంకోవైపు అందని ఆర్థిక సహాయం.. ఇలా అన్ని వైపులా రైతాంగం నష్టపోతూనే ఉన్నారని ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (NTR District YSR Congress Party President) దేవినేని అవినాష్ విమర్శించారు. రైతుల (Farmers) ను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన ఎన్డీఏ నేతలు నట్టేట ముంచారని ఆరోపించారు. జిల్లా రైతాంగానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ (collector lakshmi shah) కు సోమవారం అందజేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈసందర్భంగా దేవినేని అవినాష్ (Devineni Avinash) మాట్లాడుతూ… జిల్లాలో సంవత్సర కాలంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ, రైతులు సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను కలెక్టర్ కు చెబితే ఆయనకే ఈ సమస్యలు తెలియకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టించిందనీ, రైతులు (Farmers) పండించిన పంటలు రోడ్డు మీద పోసే పరిస్థితి వచ్చిందన్నారు. ఎంతో ముఖ్యమైన ఎరువులను దళారుల నుంచి బ్లాక్ లో కొనాల్సిన దుస్థితి వచ్చిందన్న ఆయన చంద్రబాబు (Chandrababu) రైతులను నట్టేట ముంచుతున్నాడన్నారు. వైసీపీ చెప్పిన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయాలని, రైతుల కోసం ఎక్కడికైనా వెళ్లి పోరాడతామని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ మొండితోక కరుణ్ కుమార్ మాట్లాడుతూ… యూరియా (Urea) అనేది రైతులకు ఎంత ఉపయోగమో కలెక్టర్ కి వివరించామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమి అమలు కావటం లేదన్నారు. ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరూ గమనిస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర (Affordable price for the farmer) ఇస్తామని మాట తప్పారనీ, ఏ రైతు కూడా ఆనందంగా లేరు,, గిట్టుబాటు ధర కల్పించటం లేదన్నారు. వైసీపీ హయాం లో ప్రతి రైతుకు న్యాయం జరిగిందన్న ఆయన ఈ ప్రభుత్వం రైతును దగ చేస్తుందన్నారు.
ఎంత యూరియా సప్లై చేయాలో బఫర్ స్టాక్ (Buffer stack) లేదనీ, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీరు ప్రవర్తన మార్చుకోకపోతే రైతుల తరపున పోరాటం (fight) చేస్తామన్నారు. రైతుల నుంచి ఒక్క కంప్లైంట్ రాలేదని కలెక్టర్ చెప్పటం దారుణమన్నారు. కలెక్టర్ తో కూడా ప్రభుత్వం అబద్ధాలు చెప్పేస్తుందనీ, యూరియా దళారుల ద్వారా వెళ్తుంది.. దమ్ముంటే చర్యలు తీసుకోడంటూ ఆయన సవాల్ (challenge) విసిరారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణుతో పాటు పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.