YSRCP | ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
YSRCP | గుడివాడ, ఆంధ్రప్రభ : రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) 69వ వర్ధంతిని గుడివాడ రాజేంద్రనగర్‌లోని వైయస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంటరానితనం, కులవివక్షతకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాటం చేశారని కొనియాడారు. ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం తుదిశ్వాస వరకు ఆయన పనిచేశారన్నారు.
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గొర్ల శీను, జిల్లా అధికార ప్రతినిధి ఎంవీ నారాయణరెడ్డి, పాలేటి చంటి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మట్ట జాన్ విక్టర్, వైకాపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మెండా కిరణ్, తులమిల్లి ఏషయ్య, గంట శీను, జ్యోతుల సత్యవేణి, కొంకతల ఆంజనేయ ప్రసాద్, చుండూరు శేఖర్, గొళ్ళ రామకృష్ణ (Golla Ramakrishna) బాబి, సమోసాలు నాని, తోట రాజేష్, జ్యోతుల మణికంఠ, జోషి , కందుల నాగరాజు, పేయ్యల ఆదాము, రమీజా , సురేఖ, ఎస్.కె అలీ సాహెబ్ (బాజీ), కాకొళ్ళు ప్రసాద్ , మామిళ్ళ ఎలీషా, జీఎస్టీ భాష, ఖాదర్ బేగ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు

