YSR CP | శరీరానికే కానీ.. మనసుకు కాదు..

YSR CP | శరీరానికే కానీ.. మనసుకు కాదు..
YSR CP | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంను వైయస్సార్ సీపీ(YSR CP) దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దీనికి వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి(Vishveshwar Reddy) హాజరయ్యారు.
ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి వారు కేక్ కటింగ్ చేశారు. దివ్యాంగులు అనేక అద్భుతాలను సృష్టిస్తున్నారని వెంకటరామిరెడ్డి తెలిపారు. శరీరానికి వైకల్యం తప్పా మనసుకు కాదు అన్నారు. సాధారణ వ్యక్తుల కంటే మెరుగైన ఫలితాలను దివ్యాంగులు ఆయా విభాగాల్లో తీసుకొస్తున్నారని ప్రశంసించారు. వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలను అందించిందని గుర్తు చేశారు.
