YS JAGAN CBI CASE  :  సీబీఐ బోనులో  జగన్

YS JAGAN CBI CASE  :  సీబీఐ బోనులో జగన్

  • తెరమీదకు.. బీహార్​ కహానీ..  

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి)

ఆరేళ్ల విరామం తరువాత వైసీపీ అధినేత వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టు బోను ఎక్కారు. వేలాది కోట్ల రూపాయల.. అక్రమాస్తుల కేసుల నుంచి  ( YS Jagan Mohan Reddy) ​ జగన్​ మోహన్​ రెడ్డికి విముక్తి లభిస్తుందా? మళ్లీ చర్లపల్లి జైలుకు వెళ్తారా? ఆరేళ్లు సీబీఐ కోర్టు విచారణకు దూరమైన మాజీ సీఎం (YS Jagan CBI Case). తాజాగా సీబీఐ కోర్టు (Cbi Court) బోను ఎక్కక తప్పలేదు. ఔను 11 సీబీఐ చార్జిషీటులు (Charge Sheet).  9 ఈడీ ఫిర్యాదులు. నిందితుడు  జగన్​ పై విచారణకు ఎదురు చూస్తున్నాయి.  

YS JAGAN CBI CASE

 భారత దేశంలోని జైళ్లల్లో   5,06,606 మంది ఖైదీలు  జైలు జీవితం అనుభవిస్తుంటే..  3.75 లక్షల మంది అండర్‌ ట్రయల్ ఖైదీలు ( Under Trail Prisonors)  కనీసం బెయిల్​ దొరక్క బిక్కుబిక్కుమంటున్నారు. ఒక మాజీ సీఎం బిడ్డ   జగన్​ ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 20 ఆరోపణలను (20 Casess) ఎదుర్కొంటున్నారు. ఈయనకు తోడుగా మరో 125 మంది  ఈకేసుల్లో  నిందితులే. ( 125 Acused) అందరూ బయటే ఉన్నారు.

ఆరేళ్లు.. ఎంతో యాక్టివ్​ గా.. తమ కార్యకలాపాలను నిర్వహించారు. ఇప్పటికీ ఈ కేసుల నుంచి విముక్తి పొందుతామని గంపెడాశతో ఉన్నారు. ఇంతకీ సీబీఐ కోర్టు వీరందరని నిర్దోషులుగా విడుదల చేస్తుందా.. జైలు శిక్ష విధిస్తుందా? అనే ఉత్కంఠను కాసేపు పక్కన పెడితే.. బీహారీ మాజీ సీఎం  లల్లూ ప్రసాద్​ యాదవ్ ( Bihar Ex CM Lalu)​ జైలు కథను జనం మననం చేసుకొంటున్నారు.  అసలు ఈ కిడ్​ ప్రో కేసులు ఏమిటీ? పొలిటికల్ నేతలు ​, బ్యూరోక్రాట్లు  వివిధ కుంభకోణాల్లో    ఇరుక్కున్నారా? భాగస్వాములయ్యారా? ఈ అసలు కేసులేంటో ఓ సారి గుర్తు చేసుకుందాం.

YS JAGAN CBI CASE  :   క్విడ్​ ప్రో చరిత్రకు 12 ఏళ్ల సాక్షి

అది 2011 ఆగస్టు 10,  ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ప్రజలు ఉలిక్కి పడ్డారు. దివంగత సీఎం వైఎస్​ రాజశేఖరరెడ్డి (Ex CM YSR) తనయుడు జగన్ మోహన్​ రెడ్డిపై కిడ్​ ప్రో (QUID PRO) ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. పత్రికల్లో.. పతాక శీర్షికల్లో వార్తలు కలకలం సృష్టించాయి. టీవీలు మార్మోగాయి.

ఔనా.. అంటే జౌను అంటూ.. అప్పటి చేనేత శాఖ మంత్రి ( EX Minister Sankar Rao)  పి. శంకర్ రావు   హైకోర్టులో పిటీషన్​ (Petion in High Court) దాఖలు చేశారు.  వైఎస్​ఆర్​ తనయుడు  జగన్  వ్యాపారాల్లో దొడ్డి దారిలో కొన్ని కంపెనీలు  పెట్టుబడులు పెట్టాయి.  తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి  జగన్​ అక్రమ ఆస్తులు సంపాదించారు, అని శంకర్​ రావు   ఆరోపించారు.   ఈ ఫిర్యాదులపై  దర్యాప్తు చేయాలని  CBIని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత  తెలుగుదేశం నాయకుడు కింజారపు ఎర్రం నాయుడు, కడప న్యాయవాదులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు.

 YS JAGAN CBI CASE  :   రంగంలోకి సీబీఐ

 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఈ కేసును 2011 ఆగస్టు 17న  నమోదు చేసింది.   ప్రధాన నిందితుడు  జగన్  మోహన్ రెడ్డి . 2004 నుంచి  -2009 వరకూ  మాజీ సీఎం  వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో వివిధ  కంపెనీల నుంచి రూ. 1,172 కోట్లకు పైగా అక్రమంగా    భూములు, కంపెనీలు, షేర్లు సేకరించారని CBI ఆరోపించింది.   జగన్ ఆడిటర్  వి. విజయ్ సాయ్ రెడ్డి (A-2),  IAS అధికారి బి.పి. అచార్య,  ఇండస్ట్రియలిస్ట్  నిమ్మగడ్డ ప్రసాద్  సహా 125 మంది నిందితులు.

YS JAGAN CBI CASE  :   125 మంది నిందితులు

A-1  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,  YSRCP అధినేత, మాజీ సీఎం . ప్రధాన అక్రమార్జనలో కీలక పాత్ర పోషించారు. తండ్రి YSR పాలనలో పొలిటికల్​ పవర్​ ప్రయోగించి అక్రమ ఆస్తులు సేకరించారని ఆరోపణ.

A-2 :  వి. విజయసాయి రెడ్డి . ( Y Sai Reddy) నిందితుడు జగన్ సహాయకుడు, చార్టర్డ్ అకౌంటెంట్ (Charted Accout) . బెయిల్‌లు, మోసపూరిత   రిపోర్టులతో  పెట్టుబడులకు  ఛానల్ ఏర్పాటు చేశారు. ఈయన కూడా  ప్రధాన ఆరోపితుడే.

A3.  బి.పి. అచార్య: ( BP Acharya)   IAS అధికారి. సస్పెండ్​ అయ్యారు.  అరోబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్‌ కంపెనీలకు  150 ఎకరాల భూమిని కారు చౌకగా కేటాయించారు.  ప్రభుత్వానికి  రూ. 12.26 కోట్ల నష్టం కలిగినట్టు ఆరోపణ.

A 4. : కె. నిత్యానంద రెడ్డి, Satynanda Reddy) అరోబిందో ఫార్మా MD. 30 ఎకరాల భూమి కోసం   జనని ఇన్‌ఫ్రా,(Janani Infra) జగతి పబ్లికేషన్స్‌లో రూ. 10 కోట్లు బదిలీ చేశారు.

A 5. అరోబిందో ఫార్మా (Arabimdo Farma)   కంపెనీ. తక్కువ ధరకే  150 ఎకరాలు పొంది, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.

A 6.  హెటెరో డ్రగ్స్  ఫార్మా కంపెనీ (Hetero Farnma) . 150 ఎకరాలు తీసుకుని  జనని ఇన్‌ఫ్రా, జగతి పబ్లికేషన్స్‌లో  రూ. 17.25 కోట్లు బదిలీ చేసింది.

A 7.   ఆయోధ్యా రామి రెడ్డి   రామ్ కో (Ramco Group)  గ్రూప్ కంట్రోలర్. విశాఖపట్నంలో 914 ఎకరాలు విక్రయించారు.  రూ. 133 కోట్లు సంపాదించారు.  జగతి పబ్లికేషన్స్‌ ( Jagathi Publications) లో రూ. 10 కోట్లు బదిలీ చేశారు.

A 8.  రామ్​ కో  గ్రూప్  కంపెనీ. భూమి అభివృద్ధి కోసం పాలసీ మార్పించి జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.

A 9.   మాజీ మంత్రి  ధర్మాన ప్రసాద రావు , ( Ex Minister Dharmana Prasada Rao) వాన్​ పిక్​  VANPIC ప్రాజెక్టుకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు.

A 10.  మన్​ మోహన్ సింగ్ ,  సీనియర్ IAS అధికారి.  వేన్​ పిక్​  (VANPIC) ప్రాజెక్టుకు అనుకూల నిర్ణయాల్లో భాగం పంచుకున్నారు.

A 11.  ఎం. సామ్యూల్ ( M Samuel) ,  సీనియర్ IAS అధికారి. (వేన్​ పిక్​ ) VANPIC ప్రాజెక్టుకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు.

A  12.  నిమ్మగడ్డ ప్రసాద్  (వేన్​ పిక్​ )  VANPIC ప్రమోటర్. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ప్రాజెక్టు కోసం  లబ్ధి కోసం  జగన్ కంపెనీల్లో రూ. 854 కోట్లు పెట్టారు.

A 13.  ఉమ్మడి ఏపీ   హోం శాఖ, మైనింగ్​ శాఖ మాజీ మంత్రి ,   సబితా ఇంద్రా రెడ్డి ( Ex Minister Sabitha Indra ReddY)   డాల్మియా సిమెంట్‌కు లీజులు పొడిగించారు.

A 14  డాల్మియా సిమెంట్ కంపెనీ ( Dalmia Cement ). మైనింగ్ లీజులు పొంది, జగన్  కంపెనీకి  రూ. 95 కోట్లు బదిలీ చేసింది.

A  15.  ఇండియా సిమెంట్స్ (India Cements)  కంపెనీ. కాగెర ,  కృష్ణా నదుల నుంచి నీటి కేటాయింపు,  మైనింగ్ లీజు పొంది, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌కి  రూ. 140 కోట్లు బదిలీ చేసింది.

A  16.  పెన్నా సిమెంట్  (Penna Cement) కంపెనీ. లైమ్‌ స్టోన్ మైనింగ్ లీజులు పొందింది, జగతి పబ్లికేషన్స్‌ కి  రూ. 25 కోట్లు, కార్మెల్ ఆసియాకి  రూ. 23 కోట్లు బదిలీ చేసింది.

A  17. శ్యామ్ ప్రసాద్ రెడ్డి : లేపాక్షి నాలెడ్జ్ హబ్ (LKH) ప్రమోటర్. 2004-2009 మధ్య భూముల కోసం  జగన్ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో నగదు బదిలీ చేసింది.

A 18.  లేపాక్షి నాలెడ్జ్ హబ్ (LKH)  కంపెనీ. భూముల కోసం జగన్​ కంపెనీల్లో  పెట్టుబడులు పెట్టింది.

A 19.  ఇందు టెక్‌ జోన్ (Indi Tech Zone)   SEZ అభివృద్ధికి శంషాబాద్‌లో భూమి పొందింది, జగన్ కంపెనీకి  రూ. 70 కోట్లు బదిలీ చేసింది.

A  20   ఇందు టెక్‌ జోన్ యజమాని కంపెనీ. 2004 నుంచి -2009 మధ్య లబ్ధి పొందింది.  ఇక  2012 మార్చి 31న  సీబీఐ (CBI ) 11 చార్జ్‌షీట్లు దాఖలు చేసింది  . ED కూడా 9 ఫిర్యాదు  దాఖలు చేసింది. 2012 మే 27న జగన్​ మోహన్​ రెడ్డిని  అరెస్ట్ చేశారు. 2012,  -2013  సుప్రీం కోర్టు  బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. 16 నెలల అండర్​ ట్రయల్​  జైలు జీవితం అనంతరం జగన్​ మోహన్​ రెడ్డి   2013 సెప్టెంబర్ 24న  బెయిల్‌పై విడుదలయ్యారు.

YS JAGAN CBI CASE  :   యధాస్థితి  విచారణ  

సీబీఐ చార్జిషీట్లు, ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టరేట్​ ఫిర్యాదులు దాఖలైనా.. ఈ క్విడ్​ ప్రో కేసు – విచారణ ఇంకా పూర్తి కాలేదు .  ఇప్పటికీ  ట్రయల్ ప్రారంభం కాలేదు (2013 నుంచి జగన్​  బెయిల్‌ ( YS JAGAN CBI CASE) పైనే  ఉన్నారు. ప్రస్తుతం   CBI స్పెషల్ కోర్టు జగన్‌కు ప్రత్యక్ష హాజరు మినహాయింపును రద్దు చేసింది.  వ్యక్తిగత మినహాయింపును జగన్​ కోరినప్పటికీ  CBI వ్యతిరేకించింది. దీనికి తోడు లండన్​ లో పర్యటించిన జగన్​ మోహన్​ రెడ్డి తప్పుడు ఫోన్​ నెంబర్లు ఇచ్చారని సీబీఐ న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. ఈ స్థితిలో వైసీపీ అధినేత జగన్​ మోహన్​ రెడ్డి మళ్లీ సీబీఐ కోర్టు (CBI COURT) బోను ఎక్కక తప్పలేదు. ఇక విచారణ ఏ స్థాయిలో.. ఎంత స్పీడుతో సాగుతుందో.. వేచి దూద్దాం.

Leave a Reply