మద్యం మత్తులో యువకుల వీరంగం..

మద్యం మత్తులో యువకుల వీరంగం..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ ఖిలా వరంగల్ పడమట కోటలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ లేకపోవడంతో యువకుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. వరంగల్ పడమర కోట చమాన్ సమీపంలో మద్యం మత్తులో కొందరు యువకులు హల్ చల్ చేసి స్వీట్ షాప్ దుకాణంలోకి చొరబడి యజమానితో గొడవ పెట్టుకున్నారు. షాపులోని పెయింగ్ మెషిన్, తినుబండారాలను చిందరవందరగా పడేసి ధ్వంసం చేశారు. యువకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
