ఉద్యోగం లేకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య (young man commits suicide) చేసుకున్న ఘటన హైదరాబాద్ చోటుచేసుకుంది. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్ (Lingampalli Railway Station) పరిధిలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిడుగురాళ్ల (Piduguralla) కు చెందిన బ్రహ్మారెడ్డి(27) కేపీహెచ్ బీ కాలనీలోని పీజీ హాస్టల్ లో ఉంటున్నాడు.
గత కొంతకాలంగా ఉద్యోగ వేట (job hunting) లో ఉన్నాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం రావట్లేదని గత కొంతకాలంగా మనస్థాపానికి గురవుతున్న బ్రహ్మారెడ్డి (Brahma Reddy).. కుటుంబ సభ్యులకు తాను చనిపోతున్నానని సమాచారమిచ్చి బుధవారం ఉదయం లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు (police) జేమ్స్ హాస్పిటల్ కు తరలించారు.