ట్రాక్టర్ ప్రమాదంలో..యువ రైతు మృతి

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ మండలం బెజ్జోరా గ్రామంలో ఆదివారం విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సూల్ల శ్రీనివాస్ (44) అనే రైతు వరి ధాన్యాలు ట్రాక్టర్‌లో నింపుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో శ్రీనివాస్ ట్రాక్టర్ కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆయనను సమీప ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై సిహెచ్ తిరుపతి తెలిపారు. ట్రాక్టర్ అదుపుతప్పడానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply