- అలా అనడం సరైనది కాదు..
చిట్యాల,(ఆంధ్రప్రభ) : నల్గొండ జిల్లాలో మొంథా తుఫాను వలన తడిసిన, రంగు మారిన పత్తిని సీపీఐ అధికారులు, నిబంధనలను సడలించి కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఆర్.
జానయ్యకు మెమోరండం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. సీపీఐ అధికారులు నాణ్యత పేరుతో 12 శాతం ఉంటేనే మద్దతు ధర చెల్లిస్తామని అనడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వం క్వింటాల్ పత్తికి మద్దతు ధర 8010 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని మార్కెట్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎండి అక్బర్, ఎస్కే షరీఫ్, పట్టణ నాయకులు అంజయ్య పాల్గొన్నారు.

